Internet Explorer: సేవలకు సెలవు...

Internet Explorer: సేవలకు సెలవు...
ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ ఇక నుంచి మనకు కన్పించదు

బ్రౌజింగ్‌ యాప్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ శకం ముగిసింది. ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ ఇక నుంచి మనకు కన్పించదు. 1995లో ప్రారంభమై 28 ఏళ్లుగా సేవలందిస్తుంది. విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ డివైజ్‌లపై ఫైనల్‌ అప్‌డేటెట్‌ వెర్షన్‌ IE11ను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. కొత్త బ్రౌజర్‌ మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ అప్‌డేట్‌ ద్వారా పాత బ్రౌజర్‌ను నిలిపివేసింది.

ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ బ్రౌజర్‌ ఇకపై నో మోర్‌ రిటైర్డ్‌ అని తెలిపింది. ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌కు టెక్నికల్‌ సపోర్టును ఆపేస్తున్నట్టు వెల్లడించింది. పాత బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌ అప్‌డేట్‌ ఇస్తామని తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ అప్‌డేట్‌ను కమర్షియల్‌, కన్జూమర్‌ డివైజ్‌లన్నింటికీ ఒకేసారి ఇస్తామని వెల్లడించింది.

Tags

Next Story