అంతర్జాతీయం

Inzamam-ul-Haq : పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌కి గుండెపోటు..!

Inzamam-ul-Haq : పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్(Inzamam-ul-Haq)కి గుండెపోటు వచ్చింది.

Inzamam-ul-Haq : పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌కి గుండెపోటు..!
X

Inzamam-ul-Haq : పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్(Inzamam-ul-Haq)కి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ని కుటుంబ సభ్యులు ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకి ఆంజియోప్లాస్టి నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా ఇంజమామ్ కి గుండెపోటు వచ్చింది అనే విషయం తెలియగానే అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.

1992లో వరల్డ్‌కప్‌ గెలిచిన పాక్ జట్టులో ఇంజమామ్ ఒకడు.. ఆటగాడిగా, కెప్టెన్ గా కూడా పాక్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. పాకిస్తాన్‌ ఆటగాళ్లలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం 53 ఏళ్లు ఉన్న ఇంజమామ్...తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా క్రికెట్ విశ్లేషణలను అందిస్తున్నాడు.

Next Story

RELATED STORIES