నాలుగు మోడళ్లలో ఐఫోన్ 12.. ఫీచర్లు, ధరలు చూస్తే..

నాలుగు మోడళ్లలో ఐఫోన్ 12.. ఫీచర్లు, ధరలు చూస్తే..
X
యాపిల్ కంపెనీ అధిపతి టిమ్ కుక్ ఈ ఫోన్లను విడుదల చేశారు.

ఐఫోన్ 12 శ్రేణిలో నాలుగు మోడళ్లను యాపిల్ ఆవిష్కరించింది. ఇందులో ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్, ఐఫో్న్ 12 మినీలున్నాయి. ఇక స్క్రీన్ విషయానికి వస్తే 12 ప్రొ (6.5 అంగుళాలు), ఐఫోన్ 12 ప్రొ మాక్స్ (6.7 అంగుళాలు) మాత్రమే. అమెరికా కాలిఫోర్నియాలోని యాపిల్ పార్కులో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి హాయ్, స్పీడ్ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాపిల్ కంపెనీ అధిపతి టిమ్ కుక్ ఈ ఫోన్లను విడుదల చేశారు.

ఐఫోన్ మినీ స్క్రీన్ 5.4 అంగుళాలు. అన్ని మోడళ్లూ 4, 5 రంగుల్లో, సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే, 5 జీ మద్ధతుతో వచ్చాయి. ఏ 14 బయానిక్ చిప్ సెట్ తో మెరుగైన పనితీరును ఇవి కనబరుస్తాయి. కెమెరా కూడా అప్ గ్రేడ్ చేశారు. ఫ్రంట్ కెమెరాకు నైట్ మోడ్ ఉంటుంది. 5 జీతో పనిచేసే ఈ మోడళ్లలో లైడార్ సెన్సార్ వల్ల ఆగుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్) అనుభవం మరింత అద్భుతంగా ఉండబోతోంది. ఐఫోన్ వెను క మాగ్ సేఫ్ ఉంటుంది. అంటే మాగ్నటిక్ బ్యాక్ అన్నమాట. ఏ మ్యాగ్ సేఫ్ ఛార్జర్, కేసెస్ లేదా వ్యాలెట్లను వెనక అంటించుకోవచ్చు.

అక్టోబర్ 30 నుంచి భారత్ లో: ఐఫోన్ 12 మినీ రూ.69,900, ఐఫోన్ 12 రూ.79,900, ఐఫోన్ 12 ప్రొ రూ.1,19,900, ఐఫోన్ ప్రొమ్యాక్స్ రూ.129,900 ప్రారంభ ధరలతో భారత్ లో ఈ నెల 30 నుంచి విక్రయించనున్నారు. యాపిల్ డాట్ కామ్ పోర్టల్ తో పాటు అధీకృత విక్రయదార్ల వద్దా కొనుగోలు చేసుకోవచ్చు. వీటితో పాటు స్మార్ట్ స్పీకర్ హోమ్ పాడ్ మిని (99 డాలర్లు) కూడా విడుదలయ్యాయి. భారత్ లో దీని ధర రూ.9,990. ఇంటర్ కామ్ ఫీచర్ తో వస్తున్న ఇది ఒరిజినల్ తో పోలిస్తే సగం పరిమాణంలో ఉంటుంది.

Tags

Next Story