Iran Anti Hijab Row -FIFA : ఇరాన్ క్రీడాకారునికి పాప్ క్వీన్ సంఘీభావం

Iran Anti Hijab Row -FIFA : ఇరాన్ క్రీడాకారునికి పాప్ క్వీన్ సంఘీభావం
X
ఇరాన్ హిజాబ్ వివాదానికి మద్దతుగా నిలిచిన ఫుట్ బాల్ క్రీడాకారునికి మరణ శిక్ష విధించిన ప్రభుత్వం, ఆమిర్ నసర్ కు మద్దతుగా ట్వీట్ చేసిన పాప్ క్వీన్ షకీరా

Iron Terror: ప్రస్తుతం ఇరాన్ లో నెలకొన్న పరిస్థితులు ప్రపంచమానవాళిని కదిలిస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. మహిళల హిజాబ్ కు వ్యతిరేకంగా నినదించినవారిపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం తాజాగా మారణహోమానికి తెరబడుతున్న వైనం ప్రపంచ మానవతావేత్తలను కదిలిస్తోంది. అయితే ఉరితో ఉద్యమగళాలను బిగించే ప్రయత్నం చేస్తున్నా తమ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న సామాజిక కార్యకర్తలు మాత్రం వెనక్కు తగ్గడంలేదు. వీరిలో సాధారణ వ్యక్తుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ ఎందరో ఉన్నారు. ఇందులో భాగంగానే హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ఆ దేశ ఫుట్ బాల్ క్రీడాకారుడు అమిర్ నసిర్ కు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే.


ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభమవ్వడానికి కొద్ది క్షణాల ముందు ఈ మేరకు పాప్ క్వీన్ షకీరా చేసిన ట్వీట్ ఎందరినో కదిలిస్తోంది. 'ఈరోజు వరల్డ్ కప్ ఫైనల్ పురస్కరించుకుని, మైదానంలోని ఆటగాళ్లు సహా, ప్రపంచమంతా మహిళా హక్కుల కోసం పోరాడినందుకు మరణ శిక్ష ఎదుర్కోబోతున్న ఇరాన్ క్రీడాకారురుడు అమిర్ నసిర్ కోసం ప్రార్థిస్తుందని ఆశిస్తున్నాను' అంటూ షకీరా ట్వీట్ చేసింది.


గతంలోనూ అమిర్ కు మద్దతుగా షకీరా పలు ట్వీట్ లు చేసింది. 'మానవ హక్కుల కోసం పోరాడే వారిని గౌరవించాలే కానీ, శిక్షించకూడదు. నేను అమిర్ కు మద్దతుగా నిలబడుతున్నాను' అని ట్వీట్ చేసింది.


సెప్టెంబర్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న ఉద్దేశంలో మాషా అమిని అనే 27ఏళ్ల యువతిని మోరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకోగా, మూడు రోజుల్లోనే ఆమె మరణించడంపై దేశవ్యాప్తంగా హింసాత్మక ఉద్యమాలు చోటుచేసుకున్నాయి. మాషా మరణానికి వ్యతిరేకంగా నినదిస్తూ సాగిన ఉద్యమంలో ఫుట్ బాల్ క్రీడాకారుడు అమిర్ పాలుపంచుకోవడంతో పాటూ, ప్రభుత్వాధికారి మరణానికి కారణమయ్యాడన్న ఆరోపణలతో ప్రభుత్వం అతడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మరి షకీరా ట్వీట్ తో మద్దతు కూడగట్టుకుంటోన్న అమిర్ శిక్ష నుంచి బయటపడతాడని ఆశిద్దాం.


Tags

Next Story