Mojtaba Khamenei: గాయాల నుంచి కోలుకుంటున్న సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ..

చర్చల మందు ఇరాన్‌కు వరసగా గుడ్ న్యూస్ అందుతూనే ఉన్నాయి. ఇప్పటికే, చర్చలు ప్రారంభం అవ్వడానికి ముందే కీలమైన తన రెండు డిమాండ్లను ఇరాన్ సాధించుకున్నట్లు తెలుస్తోంది. ఖతార్, ఇతర విదేశీ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ డబ్బును రిలీజ్ చేయడానికి అమెరికా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులు హార్ముజ్‌ను తిరిగి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ కూడా కోలుకుంటున్నట్లు తెలిసింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఫిబ్రవరి 28న అప్పటి సుప్రీంలీడర్, మొజ్తబా ఖమేనీ తండ్రి ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ సమయంలోనే మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు ఈ గాయాల నుంచి కోలుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం.. మొజ్తబా ముఖం తీవ్రంగా గాయపడింది. ఆయన ఒకటి లేదా రెండు కాళ్లు తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. ఈ దాడిలో మొజ్తాబా ఒక కాలు కోల్పోయారని అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ఖమేనీ శారీరకంగా ఇంకా కోలుకుంటున్నప్పటికీ, మానసికంగా చురుకుగా ఉన్నట్లు తెలుస్తోంది.ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారని, అమెరికాతో యుద్ధం, శాంతి చర్చల్ని పర్యవేక్షిస్తున్నారని, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అలీ ఖమేనీ మరణం తర్వాత మొజ్తబా మార్చి 8న సుప్రీంలీడర్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన ఫోటోలు బయటకు రాలేదు. వచ్చే రెండు నెలల్లో మొజ్తబా తొలి ఫోటోల విడుదల కావచ్చని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
