Iran Hijab Row: హిజాబ్ కార్యకర్తలపై లైంగిక దాడులు...! ప్రభుత్వమే ఉసిగొల్పుతోందా...!!??

Iran Hijab Row: హిజాబ్ కార్యకర్తలపై లైంగిక దాడులు...! ప్రభుత్వమే ఉసిగొల్పుతోందా...!!??
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక గళాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కుటిల దారులు వెతుకుతోందా? కార్యకర్తలను లైంగిక వేధింపులకు గురి చేస్తోన్న వైనం; మండి పడుతోన్న మహిళా కార్యకర్తలు
హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ మహిళా లోకం నినదిస్తోన్న వైనం చూస్తూనే ఉన్నాం. హిజాబ్ వద్దంటూ గళమెత్తిన వారిని మోరాలిటీ పోలీసులు అనేక ఇబ్బందులకు గురి చేయడంతో పాటూ, వారికి బహిరంగ ఉరి శిక్షలు సైతం విధించేందుకు వెనుకాడటం లేదు. ఈ వ్యవహారంలో సెలబ్రిటీలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న సినీరంగ, క్రీడారంగానికి చెందిన సెలబ్రిటీలను దేశం నుంచి బహిష్కరిస్తుండగా వారు వేరే దేశంలో తలదాచుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారంపై ప్రపంచదేశాల నుంచి ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా ఇరాన్ ప్రభుత్వం వెనక్కితగ్గడం లేదు. పైగా కార్యకర్తలను నియంత్రించేందుకు లైంగిక వేధింపులకు దిగుతోందని తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ క్రైస్తవ సామాజిక కార్యకర్త మేరీ మోహమ్మదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం కుటుంబంలోనే జన్మించిన మేరీ 2017లోనే క్రైస్తవాన్ని స్వీకరించారు. సామాజికంగానూ ఎన్నో అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, తన మతాన్ని మార్చుకున్నందుకు గతంలో అనేక సార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని మేరీ వెల్లడించారు. అయితే హిజాబ్ వ్యతిరేక పోరాటంలో పాలుపంచుకున్నప్పుడు మొరాలిటీ పోలీసులు తనని అత్యంత దారుణం హింసించారని మేరీ పేర్కొన్నారు. జైల్లో సెక్యూరిటీ చెక్ పేరిట బట్టలు ఊడదీసి నిలబెట్టారని,వెల్లడించారు. ఉద్యమాల్లో భాగం తమపై దాడి చేసినప్పుడు పోలీసులు తాకరాని చోట తాకుతూ అసభ్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబెట్టారు. దీన్ని బట్టి లైంగిక వేధింపులతో ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసేందుకు చూస్తోందని మేరీ తెలిపారు.

Tags

Next Story