Iran Hijab Row: చెస్ టోర్నమెంట్ సాక్షిగా హిజాబ్ ధిక్కరణ

Iran Hijab Row: చెస్ టోర్నమెంట్ సాక్షిగా హిజాబ్ ధిక్కరణ
హిజాబ్ లేకుండానే చెస్ టార్మనెంట్ లో పాల్గొన్న ఇరాన్ క్రీడాకారిణులు; సలామ్ కొట్టిన ప్రపంచం

Iran Hijab Row: ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం రోజు రోజుకూ ఉధృతం అవుతూనే ఉంది. ఓ వైపు ప్రభుత్వం ఉద్యమకారులను ఉక్కుపాదంతో అణిచివేందుకు సామవేద దండోపాయాలు అవలంభిస్తున్నప్పటికీ మరింత మంది ఉద్యమానికి ఊపిరులూదుతూనే ఉన్నారు. తాజాగా ఇరాన్ కు చెందిన ఇద్దరు చెస్ క్రీడాకారిణులు హిజాబ్ లేకుండానే అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ లో పాలుపంచుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇరాన్ లో పెద్ద దుమారమే లేవనెత్తింది.


హిజాబ్ కు వ్యతిరేకంగా నోరెత్తినవారు సెలబ్రిటీ అయినా సరే ఏమాత్రం ఆలోచించకుండా ఉరి వేసి ఉసురు తీస్తున్న ఇరన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసేందుకు సారా ఖాదెమ్, అటౌసా పోర్ఖాషియన్ నడుం బిగించారు. ఖజగస్థాన్ లోని అల్మటీలో జరుగుతున్న చెస్ టోర్నమెంట్ లో ఇరువురు క్రీడాకారిణులూ హిజాబ్ లేకుండానే పాలుపంచుకున్నారు.


ఐదు రోజుల చెస్ టోర్నమెంట్‌లో 25ఏళ్ల సారా, 34ఏళ్ల అటౌసా చేసిన సాహసం, ప్రదర్శించిన గుండె నిబ్బరం ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయో తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలు ఇరాన్ యాంటీ హిజాబ్ ఉద్యమానికి స్వచ్ఛందంగా తమ మద్దతు తెలుపుతున్నారు.



Tags

Read MoreRead Less
Next Story