Iran: రష్యా చమురు కొనాలని ప్రపంచ దేశాలను ట్రంప్ అడుక్కుంటున్నారు : ఇరాన్

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని సృష్టించింది. అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒకప్పుడు రష్యా నుంచి చమురు కొనొద్దని భారత్‌పై ఒత్తిడి తెచ్చిన అమెరికా, ఇప్పుడు భారత్‌తో పాటు వివిధ దేశాలు రష్యన్ ఆయిల్ కొనాలని బ్రతిమిలాడుతోందని ఆయన విమర్శించారు.
ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల్ని స్థిరీకరించడానికి ఇప్పుడు అమెరికా, భారత్ వంటి దేశాలను రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కోరుతోంది. రష్యన్ చమురుపై అమెరికా ఆంక్షలు ఎత్తేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ధరల్ని స్థిరీకరించడానికి రష్యా క్రూడ్ ఆయిల్ కొనడానికి అమెరికా అనుమతులు ఇచ్చిందని అరాగ్చీ విమర్శించారు.
సముద్రంలో నిలిచిపోయిన రష్య చమురు నౌకలను కొనుగోలు చేసేందుకు భారత్‌తో సహా ప్రపంచ దేశాలకు అమెరికా 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 11 వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే, ఈ వార్తల్ని భారత్ ఖండించింది. రష్యా ఆయిల్ కొనుగోలుకు తమకు ఎవరి అనుమతి అవసరం లేదని, ధరలు ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడి నుంచి కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, రష్యాకు వ్యతిరేకంగా అమెరికా మద్దతు లభిస్తుందనే ఆశతో యూరప్ కూడా ఇరాన్‌పై జరుగుతున్న ‘‘అక్రమ యుద్ధానికి’’ మద్దతు ఇస్తోందని అరాగ్చీ మండిపడ్డారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
