Iran: అవసరమైతే అణు బాంబులు తప్పవు. ఇజ్రాయేల్‌కు ఇరాన్ వార్నింగ్

ఇజ్రాయెల్‌తో ఉద్రికత్తలు నెలకొన్న వేళ...అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే తమ సైనిక విధానం మార్చుకోవాల్సి ఉంటుందని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమాల్ ఖర్రాజీ హెచ్చరించారు. తమ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడిచేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందన్నారు. తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడదని పేర్కొన్నారు. ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ బాంబింగ్ చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులను టెల్‌అవీవ్‌పైకి టెహ్రాన్ ప్రయోగించింది. ఇరాన్‌ను అణు కార్యక్రమానికి దూరం చేసేందుకు గతంలో ఐఏఈఏ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. ఆ సంస్థ అధిపతి రాఫెల్ గ్రూసీ ఇరాన్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చర్చలకు ఆ దేశం ఏ మాత్రం సహకరించడంలేదని పేర్కొన్నారు. గతేడాది ఇరాన్ బహిర్గతం చేయని ప్రాంతాల్లో యూరేనియం అణువులు దొరికాయి. వాటిపై దర్యాప్తు చేసేందుకు సహకరిస్తానని నాడు ఇరాన్ పేర్కొంది. కానీ, ఆ హామీని నిలబెట్టుకోలేదని గ్రూసీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అవసరమైతే అణుబాంబు చేస్తామన్నట్లు సుప్రీం లీడర్ సలహాదారు పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది.
ఇజ్రాయేల్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ.. అణ్వాయుధాలపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. అణు బాంబులను తయారుచేయాలనే ఉద్దేశం తమకు లేదని, కానీ మా దేశం ఉనికికి ముప్పు ఏర్పడితే నిర్ణయాన్ని మార్చుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఇరాన్ సుప్రీమ్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారుడు కమల్ ఖర్రాజీ అన్నారు. ఇరాన్ అణు ఆశయాలపై ప్రత్యేకించి ఇజ్రాయేల్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కమల్ ఖర్రాజీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ‘అణుబాంబును తయారుచేయాలనే ఉద్దేశం మాకు లేదు.. అయితే ఇరాన్ ఉనికికి ముప్పు ఏర్పడితే మా సైనిక విధానం మార్చడం తప్ప వేరే మార్గం ఉండదు’ అని ఖర్రాజీ స్పష్టం చేశారు.
ఏప్రిల్‌లో సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై జరిగిన బాంబు దాడికి ఇజ్రాయేల్ కారణమని ఆరోపిస్తూ.. టెల్ అవీవ్‌పై ఇరాన్ వందలాది ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అణ్వాయుధాల అభివృద్ధికి వ్యతిరేకంగా సుప్రీం అయతుల్లా ఖమేనీ గతంలో ఫత్వా జారీచేసినప్పటికీ ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల నుంచి బాహ్య ఒత్తిళ్ల నేపథ్యంలో అణ్వాయుధాల తయారీని పునరుద్దరించే అవకాశం ఉందని 2021లో అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం మంత్రి నర్మగర్భ ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసం ప్రత్యేకించి ఉపగ్రహాలు కోసమే రూపొందించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com