Abu Ibrahim : అమెరికాలో జరిపిన మెరుపుదాడిలో ఐఎస్‌ఐఎస్ కీలక నేత అబూ ఇబ్రహీం హతం

Abu Ibrahim : అమెరికా జరిపిన మెరుపు దాడిలో ఐఎస్‌ఐఎస్ కీలక నేత అబూ ఇబ్రహీం అల్-హషిమి అల్-ఖురేషీ హతమైనట్లు అధ్యక్షుడు బైడెన్ వెల్లడించారు. వాయువ్య సిరియాలో చేపట్టిన ఉగ్రవాద నిరోధక ప్రత్యేక ఆపరేషన్‌ను అమెరికా సైనిక దళాలు విజయవంతంగా పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. తన ఆదేశాల మేరకు సిరియాలో అమెరికా సైనిక దళాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందన్నారు.
తమ సాయుధ దళాల నైపుణ్యం, తెగువకు ధన్యవాదాలన్నారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ జరుగుతోన్న సమయంలో జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు అక్కడ జాతీయ భద్రతా బృందం స్వయంగా పర్యవేక్షించింది. 2019 అక్టోబర్ నెలలో అమెరికా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకుడు అబూ బకర్ అల్-బాగ్దాది హతమయ్యాడు. అనంతరం బాధ్యతలను అబూ ఇబ్రహీం చేపట్టారు. తాజాగా అమెరికా జరిపిన దాడిలో ఆయన కూడా అంతమయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com