Israel-Hamas war: కాల్పులకు విరామం

Israel-Hamas war: కాల్పులకు విరామం
కాల్పుల విమరణకు నెతన్యాహు కేబినెట్ ఆమోదం

గాజాలో పోరుకు తాత్కాలిక విరామం లభించనుంది. హమాస్‌తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ వార్‌ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం 4 రోజులు మాత్రమే అమల్లో ఉంటుంది. ఒప్పందం ప్రకారం... తమ వద్ద ఉన్న 240 మంది బందీల్లో 50 మందిని హమాస్ విడుదల చేస్తుందని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ప్రకటించింది. విడుదలైన ప్రతి 10 మంది బందీలకు ఒక రోజు ఒప్పందాన్ని పొడిగిస్తామని వెల్లడించింది. హమాస్‌ వద్ద ఉన్న బందీల్లో మొదట మహిళలు, పిల్లలను విడుదల చేస్తారని పేర్కొంది. మంగళవారం అర్థరాత్రి తర్వాత సమావేశమైన ఇజ్రాయెల్‌ వార్ కేబినెట్‌ సుధీర్ఘంగా చర్చించిన తర్వాత ఒప్పందానికి బుధవారం ఉదయం అంగీకారం తెలిపింది.

ఈ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది స్పష్టతరాలేదు. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత హమాస్‌పై తమ పోరాటం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించారు. హమాస్ సైనిక సామర్థ్యాన్ని నాశనం చేసి, బందీలందరినీ విడిపించేంతవరకూ యుద్ధం ఆపబోమని కేబినెట్‌ సమావేశానికి హాజరైన రక్షణశాఖ అధికారులకు నెతన్యాహు చెప్పారు. ఒప్పందం అమలు చేసే నాలుగు రోజులు నిఘా కార్యకలాపాలు కొనసాగుతాయని తదుపరి విడత దాడికి సైన్యం సమాయత్తం అయ్యేందుకు అనుమతిస్తామని చెప్పారు. ఒప్పందం యుద్ధానికి ముగింపు కాదన్నారు. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో ఖైదీలుగా ఉన్న పాలస్తీనా పౌరులను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు సమాచారం.


తాజాగా హమాస్‌తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం 4 రోజులు మాత్రమే అమల్లో ఉంటుందని ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం తమ వద్ద ఉన్న 240 మంది బందీల్లో 50 మందిని హమాస్ విడుదల చేస్తుందని ప్రకటించారు. విడుదలైన ప్రతి 10 మంది బందీలకు ఒక రోజు ఒప్పందాన్ని పొడిగిస్తామని తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత సమావేశమైన ఇజ్రాయెల్‌ కేబినెట్‌ సుధీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ సంధి ఒప్పందానికి బుధవారం ఉదయం అంగీకారం తెలిపింది. కానీ.. ఈ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు.

Tags

Read MoreRead Less
Next Story