Agreement Postponed: ఇజ్రాయెల్​-హమాస్​ ఒప్పందం అమలుకు మరింత సమయం

Agreement Postponed: ఇజ్రాయెల్​-హమాస్​ ఒప్పందం అమలుకు మరింత సమయం
కారణాలు వెల్లడించని ఇజ్రాయెల్ ప్రధాని

ఆరువారాల తర్వాత పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలికంగా తెరపడనుంది. ఖతార్‌ మధ్యవర్తిత్వంతో హమాస్‌తో 4 రోజుల కాల్పులు విరమణకు ఇజ్రాయెల్ వార్ కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం నుంచి అమల్లోకి రానున్న ఈ ఒప్పందంలో భాగంగా హమాస్‌ తన వద్ద ఉన్న బందీల్లో 50 మందిని విడుదల చేయనుంది. ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న 150 మందిని విడుదలచేస్తుంది. ఒప్పందానికి అంగీకరించిన మాత్రాన హమాస్‌తో యుద్ధం ముగిసినట్లు కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించారు. అక్టోబరు 7న హమాస్‌ ఉగ్ర సంస్థ ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులు చేసి అనేక మందిని బందీలుగా తీసుకునిపోవడంతో మొదలైన యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చేందుకు అడుగు పడింది. గాజాలో భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ ఖతార్‌, అమెరికా, ఈజిప్టు తదితర దేశాల మధ్యవర్తిత్వంతో కొంత వెనక్కి తగ్గింది. హమాస్‌తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ వార్ కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఒప్పందం ప్రకారం 240 మంది బందీల్లో 50 మందిని హమాస్ విడుదల చేస్తుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒప్పందం 4 రోజులు మాత్రమే అమల్లో ఉంటుందని తెలిపింది. అయితే విడుదలైన ప్రతి 10 మంది బందీలకు ఒక రోజు ఒప్పందాన్ని పొడిగిస్తామని ఇజ్రాయెల్ వెల్లడించింది. హమాస్ వద్ద ఉన్న బందీల్లో మొదట మహిళలు, పిల్లలను విడుదల చేస్తారని పేర్కొంది.

మంగళవారం అర్థరాత్రి తర్వాత సమావేశమైన.. ఇజ్రాయెల్ వార్ కేబినెట్ 6 గంటల సుధీర్ఘ చర్చ తర్వాత ఒప్పందానికి బుధవారం ఉదయం అంగీకారం తెలిపింది.కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత... హమాస్‌పై పోరాటం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించారు. హమాస్ సైనిక సామర్థ్యాన్ని నాశనం చేసి, బందీలందరినీ విడిపించేంతవరకూ యుద్ధం ఆపేదిలేదని..కేబినెట్ భేటికి హాజరైన రక్షణశాఖ అధికారులకు నెతన్యాహు చెప్పారు. ఒప్పందం 4 రోజులూ......... నిఘా కార్యకలాపాలు కొనసాగుతాయని తదుపరి దాడికి సైన్యం సమాయత్తమయ్యేందుకు అనుమతిస్తామని చెప్పారు. ఒప్పందం యుద్ధానికి ముగింపు కాదని నెతన్యాహు స్పష్టంచేశారు.


హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఒప్పందాన్ని ఖతార్ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో ఖైదీలుగా ఉన్న 150 మంది పాలస్తీనా పౌరులను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు సమాచారం. ఇరువైపులా మహిళలు, పిల్లలనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం గురువారం నుంచి అమల్లోకి వస్తుంది భావించారు. అయితే ఇప్పుడు అది కుదిరేలా కనపడకపోవటం తో శుక్రవారం నుంచి అమలు అవుతుంది భావించారు.

వచ్చే అవకాశాలుండగా 4 రోజుల్లో రోజుకు 12 మందిని హమాస్‌ విడుదల చేస్తుందని సమాచారం. కాల్పుల విరమణతో గాజాకు మరింత మానవతా సాయం అందించేందుకు వీలు లభిస్తుందని ఖతార్‌ తెలిపింది. ఇజ్రాయెల్‌ జరిపిన దాడులతో గాజాలో మూడొంతుల ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్లు, భవనాలు ధ్వంసం కావడంతో వారంతా శరణార్థి శిబిరాల్లో, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో కాలంగడుపుతున్నారు. శాంతియుత వాతావరణం ఏర్పడినా వారంతా తిరిగి తమ గృహాలకు వెళ్లే పరిస్థితిలేదని అంతర్జాతీయసహాయ సంస్థలు చెబుతున్నాయి. వారి ఇళ్లన్నీ పూర్తిగా ధ్వంసంకావడమే ఇందుకు కారణమని వారు వెల్లడిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story