Israel-Hamas War: కాల్పుల విరమణ మరో 2 రోజులు

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి మరో రెండు రోజులు విరామం లభించింది. ఇరుపక్షాల మధ్య గత వారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం రాత్రితో ముగిసింది. దీంతో మరో రెండు ఒప్పందాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్, హమాస్ మధ్య మధ్యవర్తిత్వంవహిస్తున్న ఖతార్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ పొడిగింపు అమలులో ఉన్న రోజులు అదనంగా 10 మంది చొప్పున బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ కూడా మరో 33 మంది ఖైదీలను విడుదల చేయనుంది. ఈ మేరకు ఇరుపక్షాలు ఒక అవగాహనకు వచ్చాయి.
తొలుత కుగుర్చుకున్న ఒప్పందంలో భాగంగా నాలుగు విడుతల్లో 69 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఇజ్రాయెల్ అధికారులు 117 మంది పాలస్తీనియన్ ఖైదీలను జైలు నుంచి విడిచిపెట్టారు. ఆదివారం అర్ధరాత్రి నాటికి మూడు విడుతల్లో 58 మందిని వదిలేసిన హమాస్.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరో 11 మందిని రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. వారిలో ముగ్గురు ఫ్రెంచ్ జాతీయులు ఉండగా, ఇద్దరు జర్మనీ, ఆరుగురు అర్జెంటీనాకు చెందినవారు ఉన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా, ఖతార్, ఈజిప్ట్, స్పెయిన్, ఐరోపా సమాఖ్య(ఈయూ) చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ అంశంపై ఈజిప్ట్ సమాచార విభాగం అధికారి దియా రష్వాన్ తాజా ఒప్పందం వివరాలను సోమవారం వెల్లడించారు. ‘‘నాలుగు రోజుల కాల్పుల విరమణ.. బందీలు-ఖైదీల మార్పిడి ఒప్పందం సోమవారం అర్ధరాత్రితో ముగిసింది. రెండ్రోజులపాటు కాల్పుల విరమణ పొడిగింపు ఒప్పందం ప్రకారం.. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న ప్రతి 10 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తే.. హమాస్ 30 మంది బందీలను.. ముఖ్యంగా మహిళలు, చిన్నారులను అప్పగిస్తుంది. ఇలా రెండ్రోజుల పాటు 20 మంది పాలస్తీనా ఖైదీలు-60 మంది బందీల మార్పిడి కొనసాగుతుంది. ఆ తర్వాత ఇదే నిష్పత్తిలో అంగీకారం కుదిరితే.. కాల్పుల విరమణ మరిన్ని రోజులు ఉంటుంది. ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ ప్రకటించిన ‘నోఫ్లై జోన్’ కొనసాగుతోంది’’ అని ఆయన వివరించారు. కాల్పుల విరమణను నిరంతరాయంగా కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు. కాగా.. సోమవారం హమాస్ చెరలో ఉన్న 11 మంది బందీలను విడుదల చేశారు. ఇజ్రాయెల్ 33 మంది పాలస్తీనా ఖైదీల విడుదలకు చర్చలు జరుపుతోంది. హమాస్ విడుదల చేసిన 11 మందిలో తొమ్మిది మంది చిన్నారులు,ఇద్దరు వృద్ధులున్నారు.
మరోవైపు మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ఎక్స్ అధినేత ఈలన్ మస్క్ సోమవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఎక్స్‌లో యూదు వ్యతిరేక పోస్టులను మస్క్ ఇటీవల సమర్థించి, విమర్శలపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హమాస్ దురాగతాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆయనకు వివరించారు. కిబుట్జ్ మారణకాండ జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం గాజాలో ఉన్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎ్‌ఫ)కు స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు అందించే విషయమై ఇజ్రాయెల్-స్పే్‌సఎక్స్ మధ్య ఒప్పందం కుదర్చుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com