Gaza Hospital: ఉత్తర గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిలో స్తంభించిన వైద్యం..

Gaza Hospital: ఉత్తర గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిలో స్తంభించిన వైద్యం..
బిక్కుబిక్కుమంటూ 14వేల మంది

బిక్కుబిక్కుమంటూ 14వేల మందివద్ద ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆస్పత్రిని ఇజ్రాయెల్‌ బలగాలు చుట్టుముట్టి బాంబు దాడులు జరుపుతుండగా అందులో తలదాచుకున్న 14 వేలమందికి పైగా శరణార్థులు, వైద్యులు, క్షతగాత్రులు భయంతో గడుపుతున్నారు. ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచి .చివరి జనరేటర్‌ పనిచేయడం ఆగిపోవడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. చికిత్స అందక ఇద్దరు శిశువులు సహా మరో నలుగురు క్షతగాత్రులు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. మరో 37 మంది శిశువుల ప్రాణాలు ఆందోళనకరంగా ఉన్నాయని వివరించింది. అయితే అల్‌షిఫా ఆస్పత్రిలో హమాస్‌ కీలక స్థావరం ఉందని IDF చెబుతోంది. ఐతే ఇందుకు ఎలాంటి ఆధారాలు చూపించడం లేదని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఆ ఆస్పత్రితో సంబంధాలు తెగిపోయాయని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తంచేసింది.

గాజా ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ బాంబు దాడులు కొనసాగిస్తుండటంతో అనేక ఆస్పత్రుల్లో ఇంధన నిల్వలు హరించుకుపోయాయని, పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు నవజాత శిశువులు సహా ఓ రోగి మరణించారని, ఇంక్యుబేటర్‌లో ఇంకా 45 మంది శిశువులు ఉన్నట్లు ప్రకటించింది. ఆస్పత్రి నుండి చిన్నారులను, ఇతరులను ఆస్పత్రి నుండి ఖాళీ చేయించేందుకు సహకరిస్తున్నామన్న ఇజ్రాయిల్‌ ఆరోపణలను ఆరోగ్య నిపుణులు తిరస్కరించారు. కరెంటు లేకపోవడంతో ఇంక్యుబేటర్లు పనిచేయడం లేదని, కీలక సామగ్రి కొరత ఏర్పడుతున్నా.. ఇజ్రాయిల్‌ దళాలు ఆస్పత్రి వెలుపల యుద్ధం కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.


పౌర మరణాలు పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌తోపాటు ఫ్రాన్స్‌ కూడా..యుద్ధ విరమణ చేయాల్సిందేనని సూచించింది. మిత్రదేశాల నుంచి కూడా మద్దతు తగ్గుతుండటంతో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు స్పందించారు. తమ ప్రతిజ్ఞ కోసం యావత్‌ ప్రపంచానికి వ్యతిరేకంగా వెళ్లడానికైనా సిద్ధమేనని తేల్చి చెప్పారు. తాము విజయం సాధిస్తే స్వేచ్ఛా ప్రపంచానికి విజయం లభించినట్లేనని వివరించారు. పాలస్తీనా అథారిటీని... గాజాలోకి అనుమతించేది లేదన్న సంకేతాలను నెతన్యాహు ఇచ్చారు. తమను అంతర్జాతీయ ఒత్తిళ్లు ప్రభావితం చేయబోవన్నారు. ఉత్తర గాజాతో హమాస్‌కు సంబంధాలన్నీ తెగిపోయాయని....ఆయన చెప్పారు. ప్రస్తుతం అక్కడ హమాస్‌కు సురక్షిత ప్రదేశమే లేకుండా చేశామని ప్రకటించారు.


Tags

Read MoreRead Less
Next Story