Israel: మంత్రిని తొలగించిన ప్రధాని నెతన్యాహు

ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. రోజురోజుకూ యుద్ధం తీవ్రమౌతోంది. ఇజ్రాయిల్ అన్నివైపుల్నించి దాడులు కొనసాగిస్తోంది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నా ఇజ్రాయిల్ నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది. గత నెల రోజులుగా ఉగ్రవాద సంస్థ హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. గాజాపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ని ఆదేశించారు.అదే సమయంలో గాజాపై అణుబాబుం వేసే అవకాశాలు లేకపోలేదని ఆ దేశ మంత్రి ఎలియాహూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గాజా పౌరుల్ని నాజీలతో పోల్చిన ఆయన, గాజాలో ఉన్నవాళ్లంతా హమాస్ సానుభూతిపరులేనని స్పష్టం చేశారు. మానవతా సహాయానికై యుద్ధ విరామాన్ని తిరస్కరించారు. అసలు హమాస్‌తో సంబంధం లేని వ్యక్తులు గాజాలోనే లేరన్నాడు. గాజా స్ట్రిప్ మొత్తం శత్రువులే అన్నట్టుగా వ్యాఖ్యలు చేశాడు. పాలస్తీనియన్లు ఐర్లండ్ లేదా ఏ ఎడారిలోకో వెళ్లిపోవల్సిందేనన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. అదే సమయంలో అణుబాంబు దాడిపై వ్యాఖ్యలు చేసిన మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొలగించారు. సమావేశంలో అనుదాడిపై చర్చించాలని ప్రతిపాదించినందుకు సస్పెండ్ చేశారు.
ఇజ్రాయెల్ అణు విధానంపై ప్రభుత్వంలో భాగమైన రైట్ ఓట్జ్మా యెహుదిత్ పార్టీకి చెందిన మంత్రి ఎలియాహుపై చర్యలు చేపట్టారు. హమాస్ పాలిత గాజా స్ట్రిప్‌పై అణుబాంబు దాడి ఓ ఎంపిక అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు పెంచిన నేపథ్యంలో అణుబాంబు వేసే అవకాశం ఉందా? అని మంత్రిని ప్రశ్నించగా.. పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పాలక, ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తమయ్యాయి. దాంతో ఆయనను తొలగించాలనే డిమాండ్ వ్యక్తమయ్యాయి. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎలియాహు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అయినా సరే అతడిని కేబినెట్ నుంచి నిరవధికంగా సస్పెండ్ చేశారు
ఈ సందర్భంగా నెతన్యాహు స్పందిస్తూ అమాయకులకు హానితలపెట్టని రీతిలో అత్యున్న అంతర్జాతీయ చట్ట ప్రమాణాలకు అనుగుణంగా ఇజ్రాయెల్, ఐడీఎఫ్ వ్యవహరిస్తున్నాయన్నారు. హమాస్‌పై విజయం సాధించే వరకు దాడులు కొనసాగుతాయని పీఎంఓ ఓ ప్రకటన ప్రకటనలో తెలిపింది. ఎలియాహు భద్రతా క్యాబినెట్‌లో మంత్రి భాగం కాదని.. ఇస్లామిస్ట్ హమాస్‌కు వ్యతిరేకంగా యుద్ధాన్ని నిర్దేశించే మంత్రిత్వశాఖపై అతని ప్రభావం లేదని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com