Israel attacks: పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి

ఇజ్రాయిల్ పాలస్తీనా ల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దక్షిణ లెబనాన్‌లో ఉన్న హమాస్ టెర్రరిస్టు కేంద్రాలపై ఇజ్రాయిల్ దాడి చేసింది. ఈ దాడిలో ఎనిమిది మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన డ్రోన్ దాడిలో 8 మంది పాలస్తీయన్లు మరణించారు. 50మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్యశాఖ మంత్రి ధ్రువీకరించారు. రద్దీగా ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్న తీవ్రవాదులకు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య ఘర్షణలు జరిగాయి. రోజంతా వీరిమధ్య కాల్పులు, పేలుళ్లు జరిగాయి.14వేల మంది ఉన్న శరణార్ధి శిబిరాలపై ఆరు డ్రోన్లు తిరిగాయి.
ఇజ్రాయెల్ సైన్యం జెనిన్ శిబిరంపై దాడి చేసేందుకు పక్కా ప్రణాళికగా సాయుధ వాహనాలు, కాన్వారు చుట్టుముట్టి బాంబులు విసిరిందని, దీంతో ఇళ్లు, రోడ్లు ధ్వంసమైపోయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఈ దాడులను బట్టి చూస్తే ఇజ్రాయెల్ సైన్యం ప్రజలను మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు. మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకుంటోందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్, టెలికమ్యూనికేషన్లు, తాగునీటిని నిలిపివేసిందని, జెనిన్ నివాసితులందరికీ, ముఖ్యంగా శరణార్ధి శిబిరానికీ ఇది సామూహిక శిక్ష అని అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయిల్ సైన్యం శరణార్థుల శిబిర ప్రవేశాలను ట్రాక్టర్లతో మూసివేసింది. దీంతో దాడి వల్ల శిబిరంలో గాయపడిన వారి దగ్గరకు వైద్య బృందాలు చేరుకోవడం కష్టంగా ఉందని జెనిన్‌కు చెందిన ఒక డాక్టర్ మీడియాతో అన్నారు. ఇజ్రాయెల్ సైన్యం శరణార్థి శిబిరాలపై చేసిన దాడిని పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది.
గత నెలలో ఇదే తరహానా జెనిన్ నగరంలో జరిగిన దాడిలో ఆరుగురు పాలస్తీయన్ లు మరణించారు. ఏడుగురు ఇజ్రాయిల్ సైనికులతో పాటు పలువురు సరిహద్దు పోలీసులు గాయపడ్డారు. 1967లో అరబ్-ఇజ్రాయెలీ యుద్ధం సమయంలో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ స్థిరపడిన ఇజ్రాయెల్ పౌరులపై ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు ఎక్కువ అవుతుండటంతో ఇజ్రాయెల్ భారీగా సైన్యాన్ని మోహరించి, తరచూ దాడుల్ని నిర్వహిస్తోంది. 2వేలమంది సైనికులు తాజా ఆపరేషన్‌లో పాల్గొన్నారని అధికారులు పేర్కొన్నారు. అటు పాలస్తీనా, జోర్డాన్‌లు ఈ దాడుల్ని ఖండించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com