Israel Iran war: ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ షాహ్‌రియారీ హతం..

ఇరాన్‌లోని కీలక ప్రదేశాలు, ముఖ్య నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగుతుంది. తాజాగా, టెహ్రాన్‌కు మరో షాక్ తగిలింది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్‌రియారీ చనిపోయినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఇరాన్ నుంచి హమాస్, హెజ్‌బొల్లా, హూతీ తదితర సంస్థలకు ఆయుధాల సరఫరాలో షాహ్‌రియారీ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొనింది. ఇక, శుక్రవారం నాడు టెల్ అవీవ్ ఫైటర్ జెట్‌లు చేసిన దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళం.. డ్రోన్ యూనిట్ కమాండర్ సయీద్ ఇజాది సహా పలువురు నేతలు చనిపోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇవాళ (జూన్ 21న) ధ్రువీకరించాయి.
కాగా, 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై టెహ్రాన్ చేసిన దాడులకు ప్రణాళికలు రచించింది అతడే అని పేర్కొన్నాయి. ఇరాన్, హమాస్‌ల మధ్య కీలక సమన్వయ కర్తగానూ ఇజాది వ్యవహరించాడని తెలిపాయి. అయితే, ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనిక అధికారులతో పాటు అణుబాంబు తయారీలో పని చేస్తున్న పలువురు శాస్త్రవేత్తలు సైతం ప్రాణాలు కోల్పోయారు.
సాయుధ దళాల్లో మృతి చెందిన వారు ..
* ఘోలామ్రేజా మెహ్రాబీ – సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నిఘా డిప్యూటీ జనరల్
* మెహదీ రబ్బానీ – ఆపరేషన్ డిప్యూటీ జనరల్
* హొస్సేన్ సలామీ – ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ చీఫ్
* మహమ్మద్ బాఘేరి – సైనిక దళాల పర్యవేక్షకుడు
* అమీర్‌అలీ హాజీజదే – దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com