Israel: ఇస్లాం అధ్యయనం, అరబిక్‌ని తప్పనిసరి చేసిన ఇజ్రాయిల్..

Israel: ఇస్లాం అధ్యయనం, అరబిక్‌ని తప్పనిసరి చేసిన ఇజ్రాయిల్..
X
నిఘా వైఫల్యం ఉండొద్దనే కారణంగా మిలిటరీ సిబ్బందికి శిక్షణ..

ఇజ్రాయిల్ సైన్యంలో అన్ని రక్షణ దళాలు, ఇంటెలిజెన్స్‌లోని సైనికులు, అధికారులు ఇస్లాం గురించి అధ్యయనం చేయడం, అరబిక్ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. అక్టోబర్ 07, 2023 నాటి నిఘా వైఫల్యం తర్వాత, మరోసారి అలాంటి దాడి జరుగొద్దని భావిస్తున్న ఇజ్రాయిల్ ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది చివరి నాటికి 100 శాతం AMAN (ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌కు హీబ్రూ భాషలో సంక్షిప్త రూపం) సిబ్బందికి ఇస్లామిక్ అధ్యయనాలలో శిక్షణ ఇవ్వబడుతుందని, వారిలో 50 శాతం మంది అరబిక్ భాషా శిక్షణ పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. AMAN చీఫ్ – మేజర్ జనరల్ శ్లోమి బైండర్ ఈ ఆదేశాలను జారీ చేశారు.

ఇంటెలిజెన్స్ సిబ్బంది హౌతీల కమ్యూనికేషన్స్‌ను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో హైతీ, ఇరాకీ మాండలికాలపై కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. వీటి వల్ల మెరుగైన నిఘాను, వారి సంస్కృతిని అర్థం చేసుకునే వీలు ఉంటుందని ఇజ్రాయిల్ భావిస్తోంది. అరబిక్, ఇస్లామిక్ విద్యను బోధించడానికి అంకితమైన విభాగం ఉంటుందని సైనిక అధికారులు తెలిపారు.

Tags

Next Story