Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు..

Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు..
X
టెల్ అవీవ్‌ను లక్ష్యంగా ఐడిఎఫ్ రాకెట్ లాంచర్‌..

‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ కింద ఇజ్రాయెల్ అనేక ఇరానియన్ స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో ఆరుగురు శాస్త్రవేత్తలు, అనేక మంది సైనిక కమాండర్లు మరణించారు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై 100 కి పైగా క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ తన ప్రతీకార చర్యకు ‘ట్రూ ప్రామిస్ త్రీ’ అని పేరు పెట్టింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రధాని నరేంద్ర మోడీతో పరిస్థితిని చర్చించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను అణు ఒప్పందం చేసుకోవాలని హెచ్చరించారు. ఈ ఉద్రిక్తత మధ్యప్రాచ్యంలో అస్థిరతను పెంచుతోంది.

తాజాగా.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఐడిఎఫ్ ప్రకటన ప్రకారం.. పశ్చిమ ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న క్షిపణి లాంచర్‌లపై వైమానిక దళం దాడి చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దళ యుద్ధ విమానాలు ఇప్పటివరకు ఇరాన్‌లోని డజన్ల కొద్దీ క్షిపణులపై దాడి చేశాయి. అవి ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకడానికి ముందే మట్టుబెట్టాయి.

ఆకాశం మీదుగా ఎగురుతున్న ఇరానియన్ వైమానిక దళ విమానాలు క్షిపణి లాంచర్లను గుర్తించిన ఇజ్రయెల్ వాటిపై దాడి చేసింది. ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఐడిఎఫ్ ధీమా వ్యక్తం చేసింది.

మరోవైపు.. తాము ఇజ్రాయెల్‌పై చేస్తున్న దాడులను ఆపడానికి అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ వంటి దేశాలు ఇజ్రాయెల్‌కు సహకరిస్తే పశ్చిమాసియాలోని ఆయా దేశాల స్థావరాలను, నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. తమపై దాడులకు పాల్పడుతున్న టెల్‌అవీవ్‌కు వాషింగ్టన్‌ మద్దతునిస్తుందని ఇప్పటికే ఇరాన్‌ అధికారులు ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా అవన్నీ తప్పుడు ప్రచారాలని అగ్రరాజ్యం కొట్టిపడేసింది.

Tags

Next Story