ఇజ్రాయెల్ ఇన్‌ఫ్లుయెన్సర్.. మిలటరీ నుంచి పిలుపు రావడంతో భార్యకు వీడ్కోలు చెప్పి..

ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల నేపథ్యంలో జర్నలిస్ట్ హనన్యా నఫ్తాలీకి మిలటరీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో అతడు భార్య ఇండియా నఫ్తాలీకి వీడ్కోలు చెప్పి వెళ్లారు. దీనికి సంబంధించిన పోస్ట్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. హమాస్ ఉగ్రవాదులు శనివారం గాజా నుండి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు. ఇజ్రాయెల్ పై 3,000 రాకెట్లను ప్రయోగించి 1,100 మందికి పైగా మరణానికి కారకులయ్యారు. హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజాపై దాడులు ప్రారంభించాయి. పాలస్తీనా ఆధారిత హమాస్ నుండి ఆకస్మిక దాడికి గురైన తర్వాత ప్రస్తుతం వేలాది మంది యువకులు ఇజ్రాయెల్ సైనిక సిబ్బందిలో భాగస్వామ్యం చేయబడుతున్నారు. అందులో జర్నలిస్ట్ హనన్య నఫ్తాలీ కూడా ఒకరు.
అతను మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ Xలో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. అతడు తన భార్య ఇండియా నఫ్తాలీని కౌగిలించుకున్న చిత్రాన్ని పంచుకున్నారు. ఇకపై ప్రొఫైల్ ఆమెచే నిర్వహించబడుతుందని రాశాడు. "నా దేశమైన ఇజ్రాయెల్‌కు సేవ చేయడానికి, నా దేశ పౌరులను రక్షించడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. భగవంతుని ఆశీస్సులతో నన్ను పంపిన నా భార్య ఇండియాకు నేను వీడ్కోలు చెప్పాను. ఇక నుండి ఆమె నా తరపున నా బ్లాక్ నిర్వహిస్తుంది అని అతను పోస్ట్ పెట్టారు.
యునైటెడ్ స్టేట్స్ అదనపు సైనిక సహాయాన్ని అందిస్తానని ఇజ్రాయెల్ కి ప్రతిజ్ఞ చేసింది. ఇజ్రాయెల్ రక్షణ దళాలకు సహాయం చేయడానికి అదనపు యుద్ధ సామాగ్రిని, ఆయుధాలను అమెరికా ఇజ్రాయెల్ కు పంపిస్తోంది. అధ్యక్షుడు జో బిడెన్ వ్యక్తిగతంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఈ మేరకు హామీ ఇచ్చారు. అదేవిధంగా, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఈ ప్రతికూల సమయాల్లో ఇజ్రాయెల్‌కు తన తిరుగులేని మద్దతును తెలియజేశారు. దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకునేందుకు తోడ్పాటునందిస్తూ రెండు దేశాలు అండగా నిలబడి ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com