కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశ ఆరోగ్యశాఖ మంత్రి యూలి ఎడెల్‌స్టీన్‌తో కలిసి నెతన్యాహూ శనివారం ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇరువురు నేతలు మరో మూడు వారాల్లో బూస్టర్ డోస్ తీసుకోనున్నారు. దేశంలో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడాకి, వ్యక్తిగత ఉదాహరణలుగా నిలవడానికి ఆరోగ్యశాఖ మంత్రితో కలిసి తాను మొదటి వ్యాక్సిన్‌ను తీసుకోవాలనుకున్నానని నెతన్యాహూ అన్నారు. 71 ఏళ్ల నెతన్యాహూ టీకా తీసుకునే కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా ప్రసారమయ్యింది.
కాగా ఇజ్రాయోల్ దేశంలో ఇప్పటివరకు 3,70,000 మందికి కరోనా సోకింది. కరోనా మహమ్మారి కారణంగా 3 వేల మంది మృతి చెందారు. ఇక ఇజ్రాయెల్ దేశ వ్యాప్తంగా ఆదివారం నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com