Gaza school: గాజాలో శిబిరంపై దాడి.. 35 మంది మృతి

మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం

గాజాలో దారుణం జ‌రిగింది. ఓ స్కూల్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. సెంట్ర‌ల్ గాజాలో ఉన్న యూఎన్ సంబంధిత స్కూల్‌పై జ‌రిగిన అటాక్‌లో 35 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు చెప్పారు. నుసేర‌త్ శ‌ర‌ణార్థి క్యాంపులో ఉన్న స్కూల్ టాప్ ఫ్లోర్‌పై ఇమ్రాయిల్ యుద్ధ విమానాలు రెండు మిస్సైళ్ల‌తో అటాక్ చేశాయి. స్కూల్ కాంపౌండ్‌లో ఉన్న హ‌మాస్ కేంద్రంపై దాడి చేసిన‌ట్లు ఇజ్రాయిల్ మిలిట‌రీ పేర్కొన్న‌ది. ఇజ్రాయిల్ హీన‌మైన నేరాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు హ‌మాస్ మీడియా పేర్కొన్న‌ది. దాడిలో గాయ‌ప‌డ్డ‌వారిని అంబులెన్సుల్లో రెస్క్యూ బృందాలు త‌ర‌లిస్తున్నాయి. క్లాస్‌రూమ్‌లు ధ్వంసం అయ్యాయి. మృత‌దేహాలు చెల్లాచెదురుగా ప‌డి ఉన్న వీడియోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ఐక్యరాజ్యసమితి ప్రకారం, గాజా జనాభాలో దాదాపు సగం మంది – దక్షిణ గాజాలో పది లక్షల కన్నా ఎక్కువ మంది పాలస్తీనియన్లు, ఒక నెలలోనే నిర్వాసితులుగా మారారు. గాజాలో ఏడు నెలల యుద్ధం తర్వాత మే 6న ఇజ్రాయెల్ సైన్యం రఫా నగరంలో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. రఫాను స్వాధీనం చేసుకోకుండా, మిగిలిన హమాస్ బెటాలియన్లను తొలగించకుండా విజయం అసాధ్యమని ఇజ్రాయెల్ నొక్కి చెబుతోంది. ఇప్పుడు ఇంత తక్కువ వ్యవధిలో, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు నిర్వాసితులుగా మారడంపై ఐక్యరాజ్య సమితి (యూఎన్) హెచ్చరికలు జారీ చేసింది. దీని వల్ల సహాయ పంపిణీలో విపరీత పరిణామాలు ఉంటాయని తెలిపింది.

Tags

Next Story