Istanbul: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో అరుదైన దృశ్యం

ఇస్తాంబుల్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో అరుదైన దృశ్యం కనిపించింది. టర్కీభూకంప బాధితుల కోసం ఓ చారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహించారు. వోడాఫోన్ పార్క్‌లో జరిగిన మ్యాచ్‌లో బాధితుల పిల్లల కోసం బొమ్మలను విసిరారు ప్రేక్షకులు. ఇటీవల టర్కీలో జరిగిన విధ్వంసకర భూకంపంలో లక్షల మంది నిరాశ్రయిలు అయ్యారు. బెసిక్టాస్ ఫ్రాపోర్ట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చిన్నారులకు అందించేందుకు టెడ్డీలను తీసుకురావాలని రెండు క్లబ్‌ల నిర్వాహకులు కోరారు. వారి పిల్లలకు సంఘీభావం తెలుపుతూ గ్రౌండ్‌లో వేలాది మంది సాఫ్ట్ టాయ్స్‌ను తీసుకువచ్చారు.అలాగే స్టేడియంలోని స్కోర్‌బోర్డ్‌పై, భూకంప దాటికి కాకవికలమై కుదుటపడిన 11 టర్కిష్ ప్రావిన్సుల పేర్లను కూడా డిస్‌ప్లే చేశారు. గ్రౌండ్‌లో పడిన బొమ్మలను తీసేందుకు రెండు క్లబ్‌ల ఫుట్‌బాల్ ప్లేయర్స్‌తో పాటు రిజర్వ్ బెంచ్‌లో ఉన్న ప్లేయర్స్ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com