Italy : ఇంగ్లీష్ భాషపై ఇటలీ ఉక్కుపాదం..!

మాతృభాషను కాపాడుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది ఇటలీ ప్రభుత్వం. ఇంగ్లీష్ వంటి విదేశీ భాషలను ఉపయోగించే వ్యక్తులు, సంస్థలకు భారీ జరిమానాలు విధించేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ఓ చట్టాన్ని చేయాలని నిర్ణయించింది ఇటలీ ప్రభుత్వం. ఆ దేశ ప్రధాని గియోర్జియా మెలనీ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఇటాలియన్ భాషను పరిరక్షించేందుకు నడుం బిగించాలని అధికార పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ నిర్ణయించింది. ఇంగ్లీషు వంటి విదేశీ భాషలను ఉపయోగిస్తే లక్ష యూరోల వరకు జరిమానా విధించాలని ప్రతిపాదించింది. విదేశీ భాషల వాడకం పెరుగుతుండటం వల్ల తమ సంస్కృతి తీవ్రంగా దెబ్బతింటోందని ఆందోళనలో ఉంది ఇటలీ ప్రభుత్వం. ఇక నుంచి దేశంలో పని చేసే కంపెనీలు తమ టైటిల్స్‌ను కచ్చితంగా ఇటాలియన్‌లోనే ఉండాలని ప్రతిపాదించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com