Italy: ఇటలీ కొత్త ప్రధాని కోసం ముగిసిన ఎన్నికలు..

Italy: ఇటలీలో ఎన్నికలు ముగిశాయి.. ప్రధానమంత్రి పదవికి మారియో డ్రాగి అర్ధంతరంగా రాజీనామా చేయడంతో మద్యంతరంగా ఇటలీ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు ఓటేశారు. ఇటలీ చరిత్రలో తొలిసారిగా 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించినా, యంగ్ ఓటర్ల సందడి పెద్దగా కనిపించలేదని ఇటలీ మీడియా తెలిపింది.
ఈ ఎన్నికల్లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ, ఫోర్జా ఇటాలియా, లెగా సెంటర్ రైట్, డెమొక్రాటిక్ పార్టీ, ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్, థర్డ్‌పోల్, ఇటాలియన్ లెఫ్ట్, ఇటాలెగ్జిట్ పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి.పీఎం పదవి రేసులో మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ, జార్జియా మెలోని, ఎన్రికో లెట్టా, మాంటియా సాల్విని, గుయ్‌సేఫ్ కాంటే ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో నియోఫాసిస్ట్ మూలాలు ఉన్న బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి అత్యధిక సీట్లు సాధిస్తుందని సర్వేలు తెలుపుతున్నాయి. బీఓఐపార్టీ అత్యధిక స్థానాలు గెలిస్తే ఇటలీ చరిత్రలో తొలిసారిగా మహిళ ప్రధాని బాధ్యతలను చేపట్టబోతున్నారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ అగ్రనేఏత జార్జియా మెలోని ప్రచారంలో దూసుకుపోయారు.. రెండు వారాల క్రితం నిర్వహించిన చివరి ఒపీనియన్ పోల్‌లో మెలోని నేతృత్వంలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ వైపే మొగ్గు చూపారు ఇటలీ ఓటర్లు..అంతేకాకుండా జార్జియా తనదైన శైలితో అందర్ని ఆకట్టుకుందని ఇటలీ పొలిటికల్ అనలిస్ట్‌లు అంటున్నారు.
ఇక 2018లో జరిగిన ఎన్నికలలో మెలోని పార్టీ కేవలం నాలుగు శాతం ఓట్లను మాత్రమే గెలుచుకుంది అయితే గత మూడేళ్ల కాలంలో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది.ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ 47 శాతం ఓట్లు వస్తామని సర్వేలు అంచనా వేశాయి..అక్టోబర్ 13 వరకు కొత్త పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.. ఈ సమావేశాల లోపలే కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com