రష్యా టీకాపై అనుమానం వ్యక్తం చేస్తున్న ఇటలీ శాస్త్రవేత్తలు

రష్యా టీకాపై అనుమానం వ్యక్తం చేస్తున్న ఇటలీ శాస్త్రవేత్తలు
రష్యా తయారు చేసిన కరోనా టీకాపై ఇటలీ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ మెడికల్ జర్నల్‌ ల్యాన్సెట్‌లో

రష్యా తయారు చేసిన కరోనా టీకాపై ఇటలీ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ మెడికల్ జర్నల్‌ ల్యాన్సెట్‌లో ఈ టీకాకు సంబంధించిన సమాచారం ప్రచురితమైంది. దీనిని పరిశీలించిన ఇటలీ శాస్త్రవేత్తలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ టీకాపై క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి రష్యా చెబుతున్న గణాంకాలు నమోదవుడం సాధ్యం కాదని తెలిపారు. వ్యాక్సిన్ పనితీరు ఎలా అయినా ఉండొచ్చు కానీ.. టీకా పరీక్షల్లో పాల్గొన్న అందరి వలంటీర్లలో ఒకే స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవ్వడం అనుమానమే అని అంటున్నారు. గణాంకాస్త్ర పరంగా పరిశీలిస్తే.. ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం చాలా తక్కువని చెబుతున్నారు. అయితే, తాము ల్యాన్సెట్ పత్రికలో వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ అంచనాకి వచ్చామని.. రష్యా టీకా క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి డాటాను తాము పరిశీలించలేదన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే.. ఈ టీకాను రూపొందించిన గమెలేయా ఇన్‌స్టిట్యూట్ మాత్రం శాస్త్రవేత్తలు అనుమానాలను కొట్టిపారేసింది. ఫలితాలు ఆవిధంగానే వచ్చాయని వాదిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story