Jabalpur: మోదిని చంపాల్సిందేనన్న రాజా పటేరియాకు బెయిల్ తిరస్కరణ

Jabalpur: మోదిని చంపాల్సిందేనన్న రాజా పటేరియాకు బెయిల్ తిరస్కరణ
కాంగ్రెస్‌ నేత రాజా పటేరియాకు బెయిల్‌ రిజెక్ట్; మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు

గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పై కాంగ్రెస్‌ నాయకుడు రాజా పటేరియా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ''ప్రధాని మోదీని చంపేయండి'' అంటూ చేసిన వ్యాఖ్యలపై రాజా పటారియాను పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తాజాగా దీనిపై ఆయన వేసిన బెయిల్‌ ను కోర్టు తిరస్కరించింది.

గత ఏడాది ప్రధానమంత్రిని దూషించిన కాంగ్రెస్ నాయకుడు రాజా పటేరియా బెయిల్ దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. ''మోదీ మతం, కులం, భాష ఆధారంగా విభజిస్తారని, దీనివల్ల దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని రాజా పటేరియా తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాక రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే మోదీని చంపడానికి సిద్ధంగా ఉండండి''అంటూ పటేరియా పార్టీ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు.

దీంతో రాజ్యాంగ పదవిలో ఉన్న నాయకుడి పై చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని న్యాయమూర్తి సంజయ్ ద్వివేదీ వెల్లడించారు. ఇక వాదోపవాదనలు విన్న కోర్టు నిందితుడు రాజాపటేరియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించట్లు మధ్యాప్రదేశ్ హైకోర్డు తీర్పునిచ్చింది.



Tags

Read MoreRead Less
Next Story