Lottery: యువ వ్యాపారికి జాక్‌పాట్..

చైనా వెల్ఫేర్ లాటరీలో ఓ యువ వ్యాపారి దేశంలోనే అత్యధిక బహుమతిని సొంతం చేసుకున్నారు. గుయిఝౌ ప్రావిన్స్‌కు చెందిన ఈ చిరు వ్యాపారి లాటరీలో రూ.795.84 కోట్లు గెలుచుకున్నాడని నిర్వాహకులు తెలిపారు. ఆయన 133 టికెట్లను కొన్నారని, ప్రతిసారీ ఒకే గ్రూపునకు చెందిన ఏడు నంబర్లపై పందెం కాసేవారని, ప్రతి టికెట్‌కు దాదాపు రూ.6 కోట్ల చొప్పున బహుమతి వచ్చిందని తెలిపారు. విజేత వివరాలను ఈ సంస్థ బయటపెట్టలేదు. గుర్తు తెలియని ఆ విజేత ఈ నెల 7న బహుమతిని స్వీకరించేందుకు వచ్చారని తెలిపింది.
లాటరీ దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని విజేతగా నిలిచిన వ్యాపారవేత్త చెప్పాడు. ఈ విషయం తెలిసిన తర్వాత తనకు నిద్ర కూడా పట్టలేదని అన్నాడు. 'తొలుత నేను నమ్మలేదు. తర్వాత పలుమార్లు చెక్ చేసుకున్నా. ఆ ఎగ్జైట్మెంట్లో నాకు నిద్ర పట్టలేదు' అని చెప్పుకొచ్చాడు. 'గత లాటరీలను నేను గమనించాను. ఏ నంబర్లకు జాక్‌పాట్ తగిలిందనే విషయంపై పరిశోధన చేశా. అలాంటి నంబర్లను ఎంపిక చేసుకొని, నా లక్కీ నంబర్‌ను కూడా జత చేసి బెట్ వేశా. ఇలాంటి సిరీస్‌పై నేను చాలా కాలంగా బెట్ వేస్తున్నా. లాటరీ గెలిచిన విషయాన్ని నేను నా కుటుంబ సభ్యులకు ఇంకా చెప్పలేదు. వచ్చే సెలవుల సీజన్లో వారికి ఈ విషయం చెబుతా' అని వ్యాపారవేత్త పేర్కొన్నాడు.
విజేతకు అన్షున్ సిటీలో చిన్న వ్యాపారం ఉందని లాటరీ నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 7న అతడు తన లాటరీ డబ్బును తీసుకున్నాడని చెప్పారు. జాక్‌పాట్ గెలిచిన వ్యక్తి వివరాలు బహిర్గతం చేయలేదు. సాధారణంగా లాటరీలో విజేతగా నిలిచినవారి పేర్లను గోప్యంగానే ఉంచుతారు. చైనా ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం లాటరీలో గెలిచిన మొత్తంలో ఐదో వంతు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com