apan Centenarians 2025: వంద ఏళ్ల క్లబ్‌లో మహిళలదే మెజారిటీ..

apan Centenarians 2025: వంద ఏళ్ల క్లబ్‌లో మహిళలదే మెజారిటీ..
X
జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటాలో సమాచారం

జపాన్‌లో 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో దాదాపు 100,000కి చేరుకుందని శుక్రవారం ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిలో దాదాపు 90 శాతం మంది మహిళలే. ఈ డేటాను చూసిన నెటిజన్లు పాపం మగవాళ్లు అని కామెంట్లు పెడుతున్నారు.

గత ఏడాదితో పోల్చితే

సెప్టెంబర్ 1 నాటికి జపాన్‌లో 99,763 మంది శతాధికులు ఉన్నట్లు నివేదికలు వెలువడ్డాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 4,644 మంది ఎక్కువ. వీరిలో 88 శాతం మంది మహిళలు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. క్యోటో సమీపంలోని నారా ప్రాంతంలో నివసించే 114 ఏళ్ల షిగేకో కగావా జపాన్‌లోని అత్యంత వృద్ధురాలు అని తెలిపారు. మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఆమె 80 ఏళ్లు దాటి ప్రసూతి-గైనకాలజిస్ట్, జనరల్ డాక్టర్‌గా వైద్య సేవలు అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటికి వెళ్ళేటప్పుడు ఆరోజుల్లో నడిచివెళ్లడం ప్రస్తుత శక్తికి మూలం అని పేర్కొన్నారు. ఆమెకు ఇప్పటికి మంచి కంటి చూపు ఉంది. ఆమె రోజంతా టీవీ చూస్తూ, వార్తాపత్రికలు చదువుతూ, కాలిగ్రఫీ చేస్తూ గడుపుతుంది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఉన్న బ్రిటిష్ మహిళ ఎథెల్ కాటర్‌హామ్, బ్రెజిలియన్ సన్యాసిని ఇనా కెనబారో లూకాస్ మరణం తర్వాత ఈ బిరుదు ఆమెకు దక్కింది. ఈ ఏడాది ఆగస్టులో ఆమెకు 116 ఏళ్లు నిండాయి.

జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జపాన్..

జపాన్‌లో వృద్ధుల జనాభా పెరుగుదల, వైద్య సంక్షేమ ఖర్చులకు దారితీస్తుండటంతో, ఆ ఖర్చులను భరించాల్సిన శ్రమశక్తి దేశంలో తగ్గిపోతుండటంతో జపాన్ క్రమంగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత నెలలో విడుదలైన అధికారిక డేటా ప్రకారం 2024లో జపాన్ జనాభా రికార్డు స్థాయిలో 900,000 కంటే ఎక్కువ తగ్గింది. ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా ఈ పరిస్థితిని “నిశ్శబ్ద అత్యవసర పరిస్థితి” అని పేర్కొన్నారు. ఈ ధోరణిని తిప్పికొట్టడానికి మరింత సౌకర్యవంతమైన పని గంటలు, ఉచిత డే కేర్ వంటి కుటుంబ స్నేహపూర్వక చర్యలు అమలు పరచడానికి అక్కడి ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసింది. జనాభా క్షీణత, వృద్ధాప్యాన్ని మందగించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా అర్థవంతమైన ఫలితాలను ఇవ్వలేదని పలు జపాన్ ప్రజలు అంటున్నారు.

Tags

Next Story