జనాభా కొరత.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి ప్లీజ్.. ప్రభుత్వం రిక్వెస్ట్

జనాభా కొరత.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి ప్లీజ్.. ప్రభుత్వం రిక్వెస్ట్
ఈ విషయంపై అనేక తాయిలాలు ఎరగా వేస్తున్నా ఏ మాత్రం పట్టనట్టు ఉంటున్నారు.. పెళ్లి చేసుకుంటే నగదు బహుమతులతో పాటు..

జపాన్ యువతీ యువకులు పని రాక్షసులు.. సరదా సంతోషాల్ని కూడా పక్కన పెట్టి పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తారు. 40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే ఉండదు. అసలే జనాభా తక్కువ వుంది.. మున్ముందు ఇలాగే కొనసాగితే కష్టమని భావించిన ప్రభుత్వం పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండ్రా బాబు బహుమతులు ఇప్తాం అని గడ్డం పుచ్చుకుని బతిమాలుతోంది. 2018 నాటికి జపాన్ జనాభా కేవలం 12.65 కోట్లు మాత్రమే వుంది. ఈ రెండు సంవత్సరాల్లో పెరిగింది చాలా తక్కువ. పెళ్లిళ్లు చేసుకుంటే దేశంలో జనాభా పెరుగుతుందని భావించిన జపాన్ ప్రభుత్వం.. పెళ్లి చేసుకున్న జంటలకు ఇండియన్ కరెన్సీ లో రూ.4,50,000 ప్రోత్సాహకంగా ప్రకటించింది.

ప్రపంచంలో అత్యధికంగా వృద్ధులు ఉన్నది కూడా ఈ దేశంలోనే. 100 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఇక్కడ ఎక్కువగా కనబడుతుంటారు. ఆర్థిక సమస్యల కారణంగా అక్కడి యువత పెళ్లిళ్లు చేసుకోవడానికి సుముఖత చూపరు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 నాటికి జపాన్ జనాభాలో ఇప్పుడున్న వృద్ధుల సంఖ్య 35 శాతం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ అంచనా. అలా చూసుకున్నప్పుడు దేశంలో యువత కంటే వృద్ధుల సంఖ్యే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే యువత పెళ్లిళ్లపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది.

జపాన్‌తో పాటు మరికొన్ని దేశాలు యూరప్ దేశం ఎస్తోనియా, ఇటలీ, ఇరాన్ వంటి దేశాలు కూడా యువత పెళ్లి చేసుకోవడానికి ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తున్నాయి. పని మీద శ్రద్ద పెట్టి జపాన్ యువత పెళ్లి, పిల్లలు అంటే ఆమడ దూరం పరిగెడుతున్నారు. ఈ విషయంపై అనేక తాయిలాలు ఎరగా వేస్తున్నా ఏ మాత్రం పట్టనట్టు ఉంటున్నారు.. పెళ్లి చేసుకుంటే నగదు బహుమతులతో పాటు, హనీమూన్‌కు ప్రత్యేక ప్యాకేజీ పిల్లల్ని కనడానికి జీతంతో కూడిన సెలవులు ఇస్తున్నాయంటే జనాభా పెంచడానికి జపాన్ ప్రభుత్వం ఎంత తాపత్రయపడుతోందో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీ విషయంలో జపాన్ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఆ దేశం తయారు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story