ప్రధాని మోదీతో జపాన్ ప్రధాని షింజో అబే

ప్రధాని మోదీతో జపాన్ ప్రధాని షింజో అబే
జపాన్ ప్రధాని షింజో అబే ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. జపాన్-భారత్ మధ్య సంబంధాల్లో, మౌలిక విధానాల్లో మార్పు ఉండబోదని

జపాన్ ప్రధాని షింజో అబే ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. జపాన్-భారత్ మధ్య సంబంధాల్లో, మౌలిక విధానాల్లో మార్పు ఉండబోదని.. ర‌క్ష‌ణ‌, ఆర్థిక రంగాల్లో సంబంధాలు మరింత బలపరుచుకోవాలని ఇరు దేశాల ప్రధానులు చ‌ర్చించుకున్నారు. సుమారు 30 నిమిషాల పాటు మాట్లాడిన ఇరువురు రెండు దేశాల సాధించి విజయాలను గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని జ‌పాన్ విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అనారోగ్య కారణాలతో షింజో అబే ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. నేపథ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య టెలిఫోన్ సంభాష‌ణ‌లో ఈ విష‌యం కూడా చ‌ర్చకు వ‌చ్చింది. నాయకత్వం మారినా.. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story