మూడు రోజులు పని.. మూడు రోజులు ఆఫీస్.. పెరిగిన ప్రాఫిట్

మూడు రోజులు పని.. మూడు రోజులు ఆఫీస్.. పెరిగిన ప్రాఫిట్
ఉద్యోగులందరూ సమయానికి కార్యాలయానికి వచ్చి పనిలో నిమగ్నమవుతారు.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. దీనికి కారణం, అక్కడి ప్రజలు సమయపాలనతో పాటు కష్టపడి పనిచేయడం. జపాన్ ఉద్యోగులందరూ సమయానికి కార్యాలయానికి వచ్చి పనిలో నిమగ్నమవుతారు. అక్కడ ఉద్యోగులు అభద్రతతో ఉంటారు. దాంతో సెలవు దినాలలో కూడా పనిచేస్తారు. చేస్తున్న పని పట్ల గౌరవం, మక్కువ ఉన్న ఉద్యోగులకు ఎక్కువ రోజులు సెలవు ఇవ్వాలన్న కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.

కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో, ప్రభుత్వం ఉద్యోగులకు వారానికి నాలుగు పనిదినాలు ఇవ్వాలని, మిగిలిన మూడు రోజులను వీకెండ్ హాలిడేస్‌గా ప్రకటించాలని దేశ రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కరోనా సమయంలో మూడు రోజులు ఆఫీసు, మూడు రోజులు సెలవు తీసుకోవడం ఉండేది. దీంతో ఈ సెలవుల విధానాన్ని ఇలాగే కొనసాగించాలనుకుంటోంది.

జపాన్‌లో ఉద్యోగులకు ఇప్పటికే వారానికి రెండు రోజుల సెలవు ఉంది. కొందరు తమ యజమానులను ఆకట్టుకోవడానికి మరియు ఉద్యోగ భద్రత పొందటానికి. కుటుంబ ఖర్చులను భరించటానికి అదనపు గంటలు పని చేస్తారు. పార్ట్‌టైమ్ డ్యూటీలు కూడా చేసి అనారోగ్యానికి గురవుతున్నారు. వారు మానసికంగా బాధపడుతున్నారని, కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఉద్యోగుల కోసం కొత్త నియమాలను రూపొందించాలని కోరుకుంటుంది.

ఈ నేపథ్యంలోనే మూడు రోజుల వారాంతపు సెలవు విధానాన్ని తీసుకురావాలని భావించారు. ఇంతలోనే కరోనా వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. ఫలితంగా, దాదాపు అన్ని కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే అవకాశాన్ని కల్పించాయి. దీంతో నాయకులు మూడు రోజుల సెలవును మళ్లీ తెరపైకి తెచ్చారు.

ఈ విధానంపై స్పందించిన రాజకీయ నాయకులు, కరోనా సంక్రమణ ప్రమాదం తక్కువగా ఉందని, ఉద్యోగులు తమ ఇళ్లకు మాత్రమే పరిమితం అయితే ప్రజా రవాణా వినియోగం తగ్గుతుందని అన్నారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి. లేకపోతే .. ఆ మూడు రోజులు ఆదాయాన్ని పెంచుకునే ఇతర పనులు చేయండి అని చెబుతోంది. లేకపోతే ఉన్నత చదువులకు ఈ విలువైన సమయాన్ని కేటాయించి మీ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోండని అంటున్నారు.

అయితే, వారానికి మూడు రోజులు సెలవులు ప్రకటించినట్లయితే, జీతం 20 శాతం వరకు తగ్గించబడుతుంది. అయితే కపెనీలన్నీ ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నాయి. ఉద్యోగులు తమకు నచ్చిన విధంగా వారానికి మూడు రోజులు సెలవు తీసుకోవడానికి ఈ బిల్లు అనుమతిస్తుందని నాయకులు అంటున్నారు.

ఉద్యోగుల పని గంటలు పని వాతావరణం పనిచేసే విధానాన్ని మార్చగలవని అక్కడి నాయకులు నమ్ముతున్నారు. జపాన్లోని మైక్రోసాఫ్ట్ వారి కార్యాలయంలోని ఉద్యోగుల కోసం ఆగస్టు 2019 లో మూడు రోజుల వారాంతాన్ని పైలట్ చేసింది. 'ది వర్క్ లైఫ్ ఛాయిస్ ఛాలెంజ్ సమ్మర్ -2019' అని పిలువబడే ఈ కార్యక్రమం మైక్రోసాఫ్ట్ జపాన్‌కు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మూడు రోజుల వారాంతపు సెలవు విధానం ఉత్పాదకతను దాదాపు 40 శాతం పెంచుతుందని తేలింది.

దేశంలోని మరో సంస్థ కూడా ఈ విధానాన్ని స్వచ్ఛందంగా ఎంచుకోవడానికి ఉద్యోగులను అనుమతించింది. ఈ విధానాన్ని అమలు చేస్తే చిన్న కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూడు రోజుల వారాంతాలు ఎప్పుటి నుంచి అమల్లోకి వస్తాయనేది త్వరలోనే తెలియజేస్తామంటోంది జపాన్ ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story