Japan PM: పదవి నుంచి వైదొలుగుతున్న జపాన్ ప్రధాని

జపాన్ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదా తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాజకీయ కుంభకోణాలు, ప్రజల అసంతృప్తి నేపథ్యంలో తాను ఈ నిర్ణయానికి వచ్చిట్టు కిషిదా అనౌన్స్ చేశారు. వచ్చే నెలలో తాను తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. దాంతో పాటూ అదే నెలలో జరగనున్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు. కిషిదా నిర్ణయంతో ఆయన స్థానంలో పార్టీ అధ్యక్షుడి కోసం పోటీ నెలకొంది.
రాజకీయ కుంభకోణాలు, తన మూడేళ్ల పదవీకాలంలో ప్రజల అసంతృప్తికి లొంగి వచ్చే నెలలో తాను పదవీవిరమణ చేస్తానని కిషిడా బుధవారం చెప్పారు. పాలక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డిపి) నాయకుడిగా తిరిగి తనను ఎన్ను కోకూడదనే తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం లేకుండా రాజకీయాలు పనిచేయవు అని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. రాజకీయ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో తాను ప్రజల గురించి ఆలోచించి ఈ భారీ నిర్ణయం తీసుకున్నాని చెప్పారు. సెప్టెంబరులో అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి. కిషిడా వైదొలగడంతో ఆయన స్థానంలో కొత్త నేత రానున్నారు.
కాగా, 2021లో ప్రధానమంత్రిగా కిషిద పగ్గాలు చేపట్టారు. అయితే ఎల్డీపీలో పొలిటికల్ ఫండింగ్ స్కామ్ చోటుచేసుకోవడంతో ఆయన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే కిషిద పదవి నుంచి వైదొలగనున్నట్టు చేసిన ప్రకటనపై ఎల్‌డీపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ, అపరిష్కృతం కాని సమస్యల కారణంగానే కిషిద రాజీనామా చేస్తు్న్నారనే వార్తలు పూర్తిగా బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని, పదవిలో కొనసాగాల్సిందిగా తాము ఆయనను కోరుతామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com