Japan Princess Mako: రాజ్యం వద్దు.. రాచరికపు హోదా వద్దు.. ప్రేమించిన వాడి కోసం యువరాణి రూ.10 కోట్లు..

Japan Princess Mako:  రాజ్యం వద్దు.. రాచరికపు హోదా వద్దు.. ప్రేమించిన వాడి కోసం యువరాణి రూ.10 కోట్లు..
Japan Princess Mako: ప్రేమ, పెళ్లి అనేది చాలా మంది జీవితాల్లో సాధారణమే అయినప్పటికీ ఇక్కడ రాకుమారి ప్రేమించి ఓ సాధారణ వ్యక్తిని.

Japan Princess Mako: ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసిందిలే.. మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసిందిలే అని జపాన్ రాకుమారి మాకో తాను ప్రేమించిన వ్యక్తిని తలచుకుని మురిసిపోతోంది. మూడేళ్ల విరహానంతరం ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకోనుంది. ప్రేమ, పెళ్లి అనేది చాలా మంది జీవితాల్లో సాధారణమే అయినప్పటికీ ఇక్కడ రాకుమారి ప్రేమించింది ఓ సాధారణ వ్యక్తిని.

రాచరికానికి విరుద్దంగా సామాన్య వ్యక్తులను మనువాడితే సహజంగా రావల్సిన రాచరికపు హోదా కానీ, ఐశ్వర్యం కానీ చిల్లిగవ్వ కూడా వారికి రాదు.. అయినా ప్రేమించిన వ్యక్తి కోసం అన్నీ వదులుకునేందుకు సిద్ధపడతారు. తమ ప్రేమ ఆస్తులు, ఐశ్వర్యం కోరుకోదు అని నిరూపిస్తారు. అందుకే మాకోకు రాజభరణం కింద తనకు వచ్చే రూ.10 కోట్ల (150 మిలియన్‌ యెన్‌లు) మొత్తాన్ని తిరస్కరించింది.

అనేక సంవత్సరాల వివాదాల తరువాత, జపాన్ యువరాణి మాకో తన మాజీ క్లాస్‌మేట్ కొమురోని ఈ నెలలో వివాహం చేసుకోనుంది. ఇందుకుగాను ఆమె రాచరికపు హోదాను వదులుకుంటుంది. అక్టోబర్ 26 తేదీని వీరి వివాహం జరప నిర్ణయించినట్లు ఇంపీరియల్ హౌస్‌హోల్డ్ ఏజెన్సీ తెలిపింది.

టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో ఈ జంట మొదటిసారిగా 2012 లో కలుసుకున్నారు. అప్పటికే ప్రేమికులుగా ఉన్న వీరిద్దరు 2018 లోనే వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ కొమురో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని తెలిసి మాకో కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. పెళ్లి తర్వాత వారు అమెరికాలో స్థిరపడాలనుకుంటున్నారు. కొమురో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.



మాకో రాజ కుటుంబ వివాహానికి సంబంధించిన సాధారణ ఆచారాలను అధిగమించాలని భావిస్తున్నారు. ఇలా చేస్తే ఆమె రాజ కుటుంబంలోని మొదటి మహిళా సభ్యురాలు అవుతుంది. జపనీస్ చట్టం ప్రకారం, యువరాణులు "సామాన్యుడి" ని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటే తమ హోదాను కోల్పోతారు. అయితే యువరాజులకు మాత్రం ఇది వర్తించదు.

యూత్ ఎట్రాక్టర్‌గా నిలిచిన కొమురో పోనీటైల్ వేసుకుని జపాన్‌లో అడుగు పెట్టడంతో మీడియా దృష్టిని ఆకర్షించాడు. కానీ అదే అతడికి కొత్తతలనొప్పులు తెచ్చిపెట్టింది. ప్రపంచ ప్రజల దృష్టిలో చాలా పెద్ద పాత్ర పోషిస్తున్న దేశం జపాన్‌. జపనీయులు కొందరు అతని కొత్త హెయిర్‌స్టైల్ చూసి ప్రిన్సెస్ మాకోను వివాహం చేసుకోవడానికి తగినది కాదని భావిస్తున్నారు.

జపాన్ రాజ వంశీయులు బ్రిటిష్ రాయల్స్ కంటే చాలా తక్కువ స్థాయి వ్యక్తులు. అయినప్పటికీ మాకో, కొమురోల సంబంధం బహిరంగం కావడంతో ప్రపంచంలోని సుదీర్ఘ వారసత్వ రాజవంశానికి అరుదైన దృశ్యంగా గోచరిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story