Japan: జపాన్‌లో కార్చిచ్చులు .. ఒకటి కాదు రెండు

జపాన్‌లో కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పశ్చిమ ప్రాంతంలోని రెండు కార్చిచ్చుల వల్ల వేల సంఖ్యలో చెట్లు కాలి బడిదైపోయాయి. పదుల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి. వందలాది మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్ల ద్వారా సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. ఓవైపు ఇవాహరి నగరంలోని చెట్లు కార్చిచ్చుకు కాలిపోతుండగా.. మరోవైపు ఒకాయమా నగరంలో మంటలు చెలరేగడంతో ఇళ్లు కాలిపోయాయి. ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఈ క్రమంలోనే అధికారులు కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాంలో ఉండే అధికారులను ఖాళీ చేయించారు. మంటలు అదుపుచేసేందుకు రెస్క్యూ టీమ్స్, ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తున్నారు. ఇదిలాఉండగా ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన కార్చిచ్చు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వేలాది ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. 12 వేలకు పైగా నిర్మాణాలు కాలిపోయాయి.
అలాగే మార్చి నెల ప్రారంభంలో నార్త్ కరోలినా, సౌత్ కరోలినాలో కూడా కార్చిచ్చు చెలరేగింది. దీనివల్ల దాదాపు 4 వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలిపోయింది. ఈ మంటలకు సౌత్ కరోలినాలోని మిర్టిల్ బీచ్‌కు చెందిన అలెగ్జాండ్రా బియలౌసౌ (40) అనే మహిళ కారణమని పోలీసులు గుర్తించారు. చివరికి ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాజాగా జపాన్‌లో కూడా కార్చిచ్చు చెలరేగడం కలకలం రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com