Jupiter: గురుడిపై మెరుపు..

Jupiter: గురుడిపై  మెరుపు..
రికార్డు చేసిన జపాన్‌ యువ ఖగోళ శాస్త్రవేత్త

గురు గ్రహంపై అత్యంత ప్రకాశవంతమైన మెరుపులాంటి వెలుగును జపాన్‌కు చెందిన యువ ఖగోళ శాస్త్రవేత్త టడావో ఓహ్సుగీ రికార్డు చేశారు. . గత నెలలో దీన్ని రికార్డు చేసిన అనంతరం ఈ దృశ్యాన్ని క్యోటో యూనివర్సిటీ ఖగోళ శాస్త్రవేత్తకు పంపారు. దీనిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ నమోదైన అతిపెద్ద ఫ్లాష్‌లైట్స్‌లో ఇదే అని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.గురుడి వాతావరణంపై ఇటువంటి వెలుగు.. సౌర వ్యవస్థ మూలల నుంచి దూసుకొచ్చే గ్రహశకలాలు లేదా తోకచుక్కల వల్ల కనపడుతుందని అంటున్నారు.

కొన్ని రోజుల క్రితమే సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహమైన గురుడుపై ఒక భారీ విస్ఫోటనం సంభవించింది. సైజులో భూమి కంటే పెద్దగా ఉండే ఒక ఖగోళ శకలం ఢీకొట్టడం వల్ల.. ఆ విస్ఫోటనం సంభవించినట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. అంతేకాదు.. ఆ దృశ్యాన్ని ట్విటర్ మాధ్యమంగా షేర్ చేశారు. ఇప్పుడు తాజాగా అంతకంటే పెద్ద ఫ్లాష్‌లైట్ గురు గ్రహంపై కనిపించింది. జపనీస్ ఖగోళ శాస్త్రవేత్త తడావో ఓహ్సుగి ఈ ప్రకాశవంతమైన ఫ్లాష్‌ను గుర్తించాడు. గురు గ్రహంలో ఇప్పటివరకూ నమోదైన అతిపెద్ద ఫ్లాష్‌లైట్స్‌లో ఇదే అని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


మన సౌర వ్యవస్థ అంచుల నుండి వచ్చే గ్రహశకలాలు లేదా తోక చుక్కలు.. గురుగ్రహ గురుత్వాకర్షణకు ప్రభావితమై ఆ గ్రహాన్ని ఢీకొట్టినప్పుడు.. ఇలాంటి ప్రకాశంతమైన భారీ ఫ్లాష్‌లైట్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు తాజాగా కనిపించిన వెలుగు కూడా అలాంటిదేనని, ఈసారి భారీ శకలం ఢీకొని ఉండొచ్చని, అందుకే మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ భారీ ఫ్లాట్‌లైట్ కనిపించిందని అంటున్నారు. దీనిపై ప్రముఖ శాస్త్రవేత్త డా. అరిమత్సు మాట్లాడుతూ.. గురుగ్రహం తన గురుత్వాకర్షణ శక్తితో భారీ శకలాల్ని ఆకర్షిస్తుందని, అప్పుడది గ్రహంతో ఢీకొని భారీ విస్ఫోటనం సృష్టిస్తుందని, అదే ఫ్లాష్‌లైట్‌గా వెలుగుతుందని తెలిపారు. తాజాగా కనిపించిన ఫ్లాష్‌లైట్ కూడా.. ఒక శకలం ఢీకొట్టడం వల్లే సంభవించిందని తెలిపారు. అధునాతన టెలిస్కోప్‌లతోనూ ఇలాంటి వాటిని పరిశీలించడం అసాధ్యమని అన్నారు. ఆగస్టు 28న ఏర్పడిన ఈ వెలుగు గురించి డా.కొ అరిమత్సు మరో ఆరు నివేదికలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద అడ్వాన్స్‌డ్ టెలిస్కోపులు ఉన్నప్పటికీ వాటితో ఈ వెలుగులను నేరుగా గుర్తించడం అసాధ్యమని డా.కొ అరిమత్సు చెప్పారు. సూర్య కుటుంబ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ మెరుపులు చాలా కీలకమని అన్నారు.

Tags

Next Story