అమ్మా నీకు వందనం.. 4 నెలల్లో 30వేల కోట్లు దానం..

అమ్మా నీకు వందనం.. 4 నెలల్లో 30వేల కోట్లు దానం..
కోట్లు సంపాదించిన వారి జాబితా ఫోర్బ్స్ పత్రికలో చదువుకోవడం కంటే వేల కోట్ల రూపాయలు దానం చేసిన వారిని స్మరించుకోవడం ఉత్తమం

పది రూపాయలు దానం చేయాలంటే పది సార్లు ఆలోచిస్తారు.. డబ్బున్నా ఇచ్చే మనసు కూడా ఉండాలి. కోట్లు సంపాదించిన వారి జాబితా ఫోర్బ్స్ పత్రికలో చదువుకోవడం కంటే వేల కోట్ల రూపాయలు దానం చేసిన వారిని స్మరించుకోవడం ఉత్తమం. మంచి మనుషుల అడుగుజాడలు మరికొంత మందికి ప్రేరణగా నిలుస్తాయి. అమెజాన్.కామ్ ఇంక్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మాకెంజీ స్కాట్ గత నాలుగు నెలల్లో 4.1 బిలియన్ డాలర్లకు పైగా దాదాపు 400 స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇచ్చారు.

ప్రపంచంలోని ధనవంతులైన మహిళల్లో ఆమె మూడవ వ్యక్తిగా నిలుస్తారు. కోవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న అమెరికన్ల జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆమె కోరుకున్నారు". మహమ్మారి పేదరికంలో నివసించే ప్రజల పరిస్థితిని మరింత దిగజార్చిందని, అదే సమయంలో ధనవంతులు మరింత సంపదను పోగు చేసుకున్నారని స్కాట్ వివరించారు.

"గత నాలుగు నెలల్లో మొత్తం 50 రాష్ట్రాలు, ప్యూర్టో రికో, వాషింగ్టన్ డిసిలలోని 384 సంస్థలకు 4,158,500,000 (మన కెరెన్సీలో అక్షరాలా 30వేల కోట్లు) డాలర్లు బహుమతులుగా అందించారు. ఈ డబ్బుతో వారి ప్రాథమిక అవసరాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

గత సంవత్సరంలో తాను 1.7 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చానని స్కాట్ తెలిపారు. స్కాట్.. అమెజాన్ ప్రారంభ దశలో కీలక పాత్ర పోషించారు. 2019 లో బెజోస్ నుండి విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు భరణంగా 38 బిలియన్ డాలర్లు లభించాయి. ఆ సంపద ఇప్పుడు 60 బిలియన్ డాలర్లకు పెరిగింది.

మే 2019 లో "గివింగ్ ప్రతిజ్ఞ" పై సంతకం చేసిన తరువాత ఆమె చాలా స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చారు. ఆమె తన జీవితకాలంలో లేదా మరణించిన తరువాత గాని తన సంపదలో కనీసం సగం స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇంతకూ మెకంజీ ఆస్తివిలువ ఎంతనుకున్నారు.. సుమారు 4.1 లక్షల కోట్లు.

Tags

Read MoreRead Less
Next Story