Johnny Depp: హీరోకు సారీ చెబుతూ భారీ ఆఫర్..రూ.2355 కోట్లు..

Johnny Depp: హీరోకు సారీ చెబుతూ భారీ ఆఫర్..రూ.2355 కోట్లు..
Johnny Depp: ప్రపంచ రాజకీయాల్లో ఏ చిన్న మార్పు జరిగినా ఆ ఎఫెక్ట్ షేర్ మార్కెట్‌పై పడినట్లు.. సెలబ్రెటీలు, సినీనటుల విషయంలోనూ అలాగే ఉంటుంది.

Johnny Depp: ప్రపంచ రాజకీయాల్లో ఏ చిన్న మార్పు జరిగినా ఆ ఎఫెక్ట్ షేర్ మార్కెట్‌పై పడినట్లు.. సెలబ్రెటీలు, సినీనటుల విషయంలోనూ అలాగే ఉంటుంది. హాలీవుడ్ స్టార్ జానీ డెప్ పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతడి కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు భార్య అంబర్ హెరాల్డ్‌తో విబేధాలు రావడం.. అది విడాకుల వరకు వెళ్లడం, ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటూ కోర్టు మెట్లు ఎక్కడం తెలిసిందే. ఈ కేసులో జానీ విజయం సాధిండాడు. కానీ ఈలోపు అతడి కెరీర్ గాడి తప్పింది. జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. డిస్నీ వంటి బడా సంస్థలు జానీతో సినిమా చేసేందుకు వెనుకాడాయి.

అయితే ఇప్పుడు కోర్టులో జానీ నిర్థోషి అని నిరూపితమవడంతో అతడితో కలిసి పని చేయాలని డిస్నీ ఆరాటపడుతోంది. దానికంటే ముందు అతడికి క్షమాపణ కోరుతూ లేఖ రాసింది.. తమ సినిమాలో నటించేందుకు రూ.2,355 కోట్లు (301 మిలియన్ డాలర్స్) ఆఫర్ చేసినట్లు సమాచారం. మొదటి ఐదు భాగాల్లో జానీనే నటించాడు అందుకే ఆ తరువాతి భాగాల్లోనూ అతడే నటించాలని భావిస్తోంది, అందుకే అతడిని బతిమాలుతోంది. మరి జానీ మనసు మార్చుకుని కరేబియన్ సినిమాలో కనిపిస్తాడో లేదో చూడాలి.

జానీ డెప్ తన మాజీ భార్య అంబర్ హర్డ్‌పై వేసిన $50 మిలియన్ల పరువు నష్టం కేసును గెలుచుకున్నాడు. వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్‌లో ఆరు వారాల పాటు విచారణ జరిగింది. 2018లో ఆప్-ఎడ్‌కు సంబంధించి నటుడు తన మాజీ భార్యపై పరువు నష్టం దావా వేశారు, అక్కడ ఆమె తనని తాను గృహహింస బాధితురాలిగా పేర్కొంది.

ఇది జానీ డెప్ కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది, సినిమాల్లో అవకాశాలు రావడం మానేశాయి. ఫెంటాస్టిక్ బీస్ట్ 3 మరియు పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ వంటి సినిమాలు అతడితో సినిమాలు చేయడానికి నిరాకరించాయి. $50 మిలియన్ల పరువు నష్టం కేసులో జానీ గెలిచిన తర్వాత, అభిమానులు డిస్నీని నటుడికి క్షమాపణ చెప్పాలని కోరారు.

ఆస్ట్రేలియన్ పాప్ కల్చర్ ప్రకారం, డిస్నీ జానీకి క్షమాపణ లేఖ పంపింది. ఇది మాత్రమే కాకుండా, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్‌లో జాక్ స్పారోగా తిరిగి రావడానికి కంపెనీ అతనికి రూ. 2,535 కోట్లు ఆఫర్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story