కరోనా వ్యాక్సిన్‌ పరీక్షల నిలిపివేత

కరోనా వ్యాక్సిన్‌ పరీక్షల నిలిపివేత

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి పలు ప్రఖ్యాత ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నాయి.. ఇందులో కొన్ని కీలక దశకు చేరాయి. రెండు మూడు కంపెనీలు తయారుచేస్తున్న వ్యాక్సిన్‌ పరీక్షలు ఆశాజనకంగా సాగుతున్న క్రమంలో అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జే అండ్‌ జే) షాకింగ్ ప్రకటన చేసింది. తమ వ్యాక్సిన్ ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్లతో ఒకరు అనారోగ్యానికి గురైనందున.. వ్యాక్సిన్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు జాన్సన్ & జాన్సన్ సోమవారం స్పష్టం చేసింది. 60,000 మందిని క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ వ్యవస్థను నిలిపివేశారు. మరోవైపు రోగుల భద్రతా కమిటి కూడా భేటీ అయి ప్రస్తుతం పరిస్థితిని సమీక్షించింది. ఇదిలావుంటే అమెరికాతో పాటు అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, పెరూ, బ్రెజిల్‌, చిలీ, దక్షిణాఫ్రికాలో క్లినికల్‌ ట్రయల్స్‌ను కంపెనీ నిర్వహిస్తోంది జాన్సన్‌ అండ్‌ జాన్సన్ ఫార్మా కంపెనీ.

Tags

Read MoreRead Less
Next Story