Jyoti Maurya Case: జ్యోతి మౌర్య కేసులో కొత్త ట్విస్ట్

సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ జ్యోతి మౌర్య, ఆమె భర్త మధ్య వివాదం ఎంతగా వార్తల్లోకెక్కిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా జ్యోతి, తన భర్త అలోక్ పై మరో ఆరోపణ చేశారు. తన భర్త మొబైల్లో తన ప్రైవేట్ వీడియో లు ఉన్నాయని, వాటిని అతను వైరల్ చేస్తే తన జీవితం నాశనం అవుతుందని, అంతేకాక తన వాట్సప్ అకౌంట్ భర్త హ్యాక్ చేసాడంటూ ఆరోపించారు. ఆఫీస్ కి సంబంధించిన పత్రాలు, డిపార్ట్మెంట్ కు సంబంధించిన రహస్య పత్రాలు కూడా ఆలోక వద్ద ఉన్నాయి కాబట్టి తను అలోక్ కి వ్యతిరేకంగా ఏం చేయడానికి ఆలోచించాల్సి వస్తోందన్నారు.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన అలోక్ మౌర్య, జ్యోతి మౌర్య ఇద్దరు దంపతులు. 2010లో వీరికి వివాహం కాగా, 2015 లో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి అన్నా జ్యోతి మౌర్య కలను నిజం చేయటానికి, అలోక్ తనకు వీలైనంత సహాయం చేశాడు. ఈ క్రమంలోనే ఆమెను ప్రయాగ్‌రాజ్‌లోని మంచి కోచింగ్ సెంటర్‌లో చేర్పించి ఆమె లక్ష్యానికి చేరువయ్యేలా చేశాడు. ఎట్టకేలకు ఆమె 2016లో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఇక్కడి నుండే అసలు కథ మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక జ్యోతి లో బాగా మార్పు వచ్చిందంటున్నాడు భర్త. తన భార్యకు గొప్ప ఉద్యోగం వచ్చిందని సంతోషించేలోపు పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. తప్పుడు వరకట్నం కేసు పెట్టి అరెస్టు చేయించిందంటూ మీడియా ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆమె తన పై ఆఫీసర్ తో అక్రమ సంబంధం పెట్టుకుని, ఇద్దరూ కలిసి బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతున్నాడు.
అయితే అలోక్ చెప్పేవన్నీ అబద్ధాలని జ్యోతి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు వివాహమైన సమయంలో పంచాయతి అధికారి అని చెప్పి మోసం చేశారని అయినా సరే తన మౌనంగా ఉండిపోయానని కానీ ఇప్పుడు అతను తనను కట్నం కోసం వేదిస్తున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. మరోవైపు జ్యోతి తో సంబంధం ఉంది అని చెప్తున్నా హోంగార్డ్ కమాండెంట్ మనీష్ దూబే ను ఇప్పటికే సస్పెండ్ చేశారు.
Tags
- Jyoti Maurya
- up
- Uttara pradesh
- Alok Mourya
- Husband cheating
- Wife cheating
- alok maurya jyoti maurya case
- sdm jyoti maurya case
- jyoti maurya
- sdm jyoti maurya
- jyoti maurya sdm news
- jyoti maurya sdm
- alok maurya
- pcs jyoti maurya
- sdm jyoti maurya news
- alok maurya jyoti maurya
- alok maurya jyoti maurya sdm
- alok maurya sdm
- pcs officer jyoti maurya
- jyoti maurya love story
- alok maurya jyoti maurya news
- alok maurya jyoti maurya chat
- jyoti maurya case
- alok maurya news
- jyoti maurya news
- sdm jyoti maurya case update
- alok maurya story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com