Kabul: వెనుదిరుగుతున్న దౌత్యవేత్తలు

Kabul: వెనుదిరుగుతున్న దౌత్యవేత్తలు
కాబుల్ నుంచి నిష్క్రమిస్తున్న దౌత్యవేత్తలు; భారీ వలసలకు ఆస్కారం

ఆఫ్ఘనిస్థాన్ లో రాజుకున్న రావణకాష్టం ఇప్పట్లో సద్దుమణిగే ప్రసక్తే లేదని తెలుస్తూనే ఉంది. దిగజారిపోతున్న మానవ హక్కుల నడుమ దౌత్యవేత్తలు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ దౌత్యవేత్తలు దేశాన్ని వీడేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే అదునుగా ఇతర దేశాలు సైతం తమ దౌత్యవేత్తలను వెనక్కు పిలిచే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే పలు దేశాలు ఇదే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాలిబన్ లు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. సౌదీ తమకు కేవలం ఓ వారం రోజులు ప్రత్యేక శిక్షణ నిమిత్తం దౌత్యవేత్తలను వెనక్కు పిలిపిస్తున్నట్లు మాత్రమే చెప్పారని వెల్లడించారు. అయితే సౌదీ తాత్కాలికంగా సిబ్బందిని వెనక్కి పిలిపించడంతో యూఏఈ, ఖతర్, రష్యా దేశాలు సైతం తమ సిబ్బందిని రక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు ఈ వార్తలను తాలిబన్ ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. దేశంలో యూఏఈ మిషన్ నిలిపివేతపై స్పందించిన తాలిబన్లు... తమ దేశంలో అంబాసిడర్ లేనప్పటికీ చాలా మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించింది.



Tags

Read MoreRead Less
Next Story