Kalpana Chawla: కొలంబియా దుర్ఘటనకు 20ఏళ్లు..

కొలంబియా డిజాస్టర్ జరిగి 20ఏళ్లు పూర్తయ్యాయి. భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లా తన రెండవ అంతరిక్ష యాత్రలో ఉన్నప్పుడు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కల్పనా చావ్లతో పాటు ఏడుగురు వ్యోమోగాములు గగనతలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
16 జనవరి 2003న కల్పనా చావ్లాతో పాటు ఏడుగురు వ్యోమోగాముల టీం 'నాసా' స్పేస్ షటిల్ కొలంబియా ద్వారా అంతరిక్షంలోకి వెళ్లింది. 15రోజుల అంతరిక్ష పరిశోధన తర్వాత తిరిగి వస్తుండగా... ఫిబ్రవరి 1, 2003న నౌక కుప్పకూలింది. టెక్సాస్ స్పేస్ సెంటర్ లో అంతరిక్ష నౌక దిగాల్సి ఉండగా 16నిమిషాల ముందే పేలిపోయింది. నాసా ఫ్లైట్ డైరెక్టర్ లెరోయ్ కెయిన్, నౌకను భూ ఆవరణంలోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంతా సజావుగా జరుగుతుందనుకున్న తరుణంలో ప్రమాదం సంభవించింది. కాసేపట్లోనే అమెరికన్ గగనతనంలో ఫైర్ బాల్స్ కనిపించాయి. వ్యోమోగాములు చనిపోయినట్లుగా అమెరికా ప్రకటించింది.
చివరి సమయంలో ఏం జరిగింది
రీ ఎంట్రీ విధానాన్ని ప్రారంభించిన తర్వాత, టెలిమెట్రీ హైడ్రాలిక్ ద్రవ ఉష్టోగ్రతలు తక్కువగా ఉన్నాయి. హైడ్రాలిక్ సిస్టమ్ లో లోపాలేమీ లేవని నాసా వెళ్లడించింది. అకస్మత్తుగా, ఎడమవైపు టైర్ ప్రెషల్ లో నష్టం జరిగిందని, సరైన టైర్ ప్రెజర్ లేకుండా షటిల్ ల్యాండ్ కాలేదని తెలిపారు.
విచారణలో ఏం తేలింది
అంతరిక్ష నౌక టేకాఫ్ సమయంలోనే.. ఒక రెక్కపై చిన్న రంద్రం పడింది, దాన్ని పంక్చర్ చేశారని ఇన్వెస్టిగేషన్లో తేలింది. వ్యోమోగాములు తిరిగి భూమిని చేరుతున్న క్రమంలో రెక్కకు ఏర్పడిన రంధ్రం లోపలికి చొచ్చుకెళ్లి ఉండవచ్చిన అభిప్రాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు, అంతరిక్ష నౌక, ధ్వని వేగంకంటే 18 రేట్లు వేగంతో ప్రయాణిస్తోందని, భూమి నుంచి 61,170 మీటర్ల ఎత్తులో ఉందని నాసా తెలిపింది. అంతలోనే నౌక కూలిపోవడంతో ప్రజలు కన్నీళ్లుపెట్టుకున్నారు.
ఎవరీ కల్పనా చావ్ల..
కల్పనా చావ్ల 1962 జులై 1న హర్యానాలో జన్మించారు. నలుగురు తోబుట్టువులలో చిన్నది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీనుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేశారు. ఉన్నత చదువులకోసం... 1982 అమెరికాకు వెళ్లిని చావ్ల.. 1984లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేశారు. 1986లో అదే సబ్జెక్ట్ పై పీహెచ్డీ చేశారు. 1983లో ఫ్రాన్స్ కు చెందిన జాన్ పియర్ ని పెళ్లిచేసుకున్నారు.
1991లో గ్రీన్ కార్డ్ పొందిన చావ్ల, అదే సంవత్సరం నాసాలో చేరారు. 1997లో అంతరిక్షంలోకి చావ్లా మొదటిసారి వెళ్లారు. అప్పటికి కల్పన వయసు 35ఏళ్లు. చావ్ల 376 గంటలు గడిపారు. ఆతర్వాత, 2003 జనవరి 16న చావ్ల చేసిన అంతరిక్ష యాత్ర చివరిదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com