ఉపాధ్యక్షురాలిగా నేను తొలి మహిళను.. కానీ..: కమలాహారిస్

సరికొత్త అమెరికా నిర్మాణంలో ట్రంప్ కూడా కలసిరావాలని పిలుపునిచ్చారు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్.. అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో డెలావర్‌లో డెమోక్రాట్ల తొలి విజయోత్సవ సభ నిర్వహించారు.. ఈ సభలో జోబైడెన్ ప్రసంగించారు.. ఇది తన విజయం కాదని, అమెరికన్ల విజయమని పేర్కొన్నారు.. కరోనా సమయంలోనూ పార్టీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.. ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రజలందరికీ రుణపడి ఉంటానన్నారు. మనకు కావాల్సింది విభజన కాదని, ఐక్యత అని గుర్తు చేశారు.. ప్రజాస్వామ్య యుతంగానే పాలన సాగిస్తానని చెప్పారు జోబైడెన్. ఇక ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.. భారత సంతతి మహిళ చరిత్ర సృష్టించారంటూ కమలా హారిస్‌ను జో బైడెన్ పొగడ్తలతో ముంచెత్తారు.
అంతకు ముందు కమలా హారిస్ ప్రసంగించారు. అమెరికన్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడారంటూ భావోద్వేగంతో మాట్లాడారు.. కఠినమైన లక్ష్యాలకోసం నిరంతరం శ్రమిస్తామన్నారు.సరికొత్త ఆశల్ని, భవిష్యత్‌ను అమెరికా కోరుకుంది.. ఉపాధ్యక్షురాలిగా నేను తొలి మహిళను.. ఇది చివరిది కాకూడదన్నారు.
ఇక డెమోక్రాట్ల విజయోత్సవ సభలో జోబైడెన్ ఫుల్ జోష్‌తో కనిపించారు.. ఉత్సాహంగా రన్ చేస్తూ స్టేజ్ మీదకు రావడంతో డెమోక్రాట్లంతా చప్పట్లతో బైడెన్‌కు స్వాగతం పలికారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలి ప్రసంగాల అనంతరం డెమోక్రాట్ అభ్యర్థులంతా వేదిక మీదకు వచ్చారు.. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.. సంబరాలు చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com