27 April 2022 11:21 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / Karachi Suicide Bomber...

Karachi Suicide Bomber : బాగా చదువుకుంది.. సూసైడ్ బాంబర్ గా మారింది..!

Karachi Suicide Bomber : చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని మంగళవారం పాకిస్తాన్ లో బాంబుదాడి జరిగింది.

Karachi Suicide Bomber :  బాగా చదువుకుంది.. సూసైడ్ బాంబర్ గా  మారింది..!
X

Karachi Suicide bomber : చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని మంగళవారం పాకిస్తాన్ లో బాంబుదాడి జరిగింది. అయితే ఈ బాంబు దాడికి పాల్పడిన మహిళ గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ముగ్గురు చైనీస్ జాతీయులతో సహా నలుగురిని చంపిన ఈ మహిళ పేరు షరీ బలోచ్.. వయసు 30ఏళ్ళు.. జంతుశాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేసింది. ఓ దంతవైద్యుడిని పెళ్లిచేసుకోగా, ఈమెకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఎంఫిల్ చదువుతోంది మరియు సైన్స్ టీచర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది.

తండ్రి ప్రభుత్వ ఉద్యోగి.. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆమె రెండేళ్ళ క్రిత్రం బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్ లోని ఆత్మాహుతి దళంలో చేరింది. పిల్లలున్న కారణంగా ఆమె ఆ దళం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆమె దానిని వదులుకుంది.

బలూచ్ రెండేళ్ల క్రితమే ఆత్మాహుతి దాడికి సంతకం చేసి ఆరు నెలల ముందే ప్లాన్‌ను ఖరారు చేశారు.

Next Story