Kate Middleton: బ్రిటన్‌ రాజభవనానికి పెరిగిన ప్రజలు తాకిడి

Kate Middleton: బ్రిటన్‌ రాజభవనానికి  పెరిగిన ప్రజలు తాకిడి
కేట్‌ క్యాన్సర్‌ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు

ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ తాను క్యాన్సర్‌ వ్యాధి బారిన పడినట్లు ప్రకటించిన తర్వాత బ్రిటన్‌ ప్రజలు పెద్ద సంఖ్య బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ వద్దకు చేరి...కేట్‌ త్వరగా కోలుకోవాలని సంఘీభావం తెలిపారు. కేట్‌ తన క్యాన్సర్‌ విషయాన్ని వెల్లడించిన మరుసటి రోజు నుంచే బ్రిటన్‌ రాజభవనానికి ప్రజలు తాకిడి పెరిగింది. కేట్‌కు కీమోథెరపీ చికిత్స అందిస్తున్నట్లు ఆ దేశ ప్రముఖ వైద్యులు తెలిపారు.

బ్రిటన్‌ యువరాజు విలియం సతీమణి...ప్రిన్సెన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ క్యాన్సర్‌ బారిన పడిన విషయం తెలిసిన ప్రజలు భారీగా బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ వద్దకు చేరుకున్నారు. కేట్‌ క్యాన్సర్‌ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. విదేశీయులు కూడా రాజ భవనాన్ని సందర్శించి ఆమె ధైర్యంగా ఈ వ్యాధిపై పోరాడి త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గోప్యత కోరుకునే హక్కు తనుకుందని పేర్కొన్నారు.తాను క్యాన్సర్‌ వ్యాధి బారిన పడినట్లు స్వయంగా కేట్‌ ఇటీవల ధ్రువీకరించారు. కానీ అది ఏ రకమైన క్యాన్సరన్నది మాత్రం వెల్లడి చేయలేదు. క్యాన్సర్ గురించి తెలియగానే షాక్‌కు గురయినట్లు తెలిపిన కేట్‌...తమ పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు. జార్జ్‌, చార్లట్‌, లూయిస్‌కు తాను క్షేమంగా ఉన్నానని,కోలుకుంటున్నానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. కిమోథెరపీ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపిన కేట్‌ దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాత్రం బహిర్గత పరచలేదు. చికిత్స పూర్తయ్యేవరకూ ఈ విషయంలో తమ గోప్యతకు సహకరించాలని ఆమె కోరారు.

యువరాణి క్యాన్సర్‌ నుంచి కోలుకోవడానికి సమగ్రంగా చికిత్స తీసుకుంటున్నట్లు భావిస్తున్నామని ఆ దేశ ప్రముఖ అంకాలజిస్టు మోనికా అవీలా తెలిపారు. క్యాన్సర్‌ చికిత్సలో కిమోథెరపీతోసహా మరికొన్ని సంప్రదాయ పద్దతులను ఉపయోగిస్తారని తెలిపారు. వీటిలో ఆపరేషన్‌ ద్వారా క్యాన్సర్‌ కణాలను తొలగించడం, రేడియోథెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేయడం వంటి పద్దతులు ఉన్నాయని తెలిపారు. కిమోథెరపీ చికిత్సలో కొన్ని దష్ప్రభావాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ విధానంలో కొన్నిసార్లు సాధారణ కణాలు సైతం నశించే ప్రమాదం ఉన్నట్లు వెల్లడించారు. ఈ చికిత్సలో రక్తకణాల సంఖ్య తగ్గేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరికొన్ని దుష్పరిణామాలను కిమోథెరపీ చికిత్సలో ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించారు. కిమోథెరపీ చికిత్స అనంతరం కోలుకోవటానికి నెలల సమయం పడుతుందన్న సిటీ ఆఫ్‌ హోప్‌ అంకాలజిస్ట్‌ యుమన్‌ ఫాంగ్‌....యువత ఈ చికిత్స నుంచి వేగంగా కోలుకుంటారని వెల్లడించారు. ఈ వ్యాధి ఎక్కువగా జన్యుపరంగా వస్తుందన్న ఆయన..పర్యావరణ మార్పుల కారణంగా కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story