సర్ఫింగ్ క్రీడాకారిణి.. ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందుతూ నీటిలోనే ప్రాణాలు..

సర్ఫింగ్ క్రీడాకారిణి.. ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందుతూ నీటిలోనే ప్రాణాలు..
అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలి.. ఒలిపింక్స్‌లో ఆడి తన దేశ పతాకాన్ని విను వీధుల్లో ఎగరేయాలనుకుంది..

అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలి.. ఒలిపింక్స్‌లో ఆడి తన దేశ పతాకాన్ని విను వీధుల్లో ఎగరేయాలనుకుంది.. చిన్న వయసులోనే సర్ఫ్ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుందిసాల్వడార్‌కి చెందిన 22 ఏళ్ల కేథరీన్ డియాజ్. కానీ విధి ఆడిన వింత నాటకంలో డియాజ్ ప్రాణాలు కోల్పోయింది.

అలల కెరటాలకు ఎదురీదిన ఆమె మృత్యువుని మాత్రం ఎదిరించలేకపోయింది.. శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే పిడుగుపాటు గురై మరణించింది. డియాజ్ శుక్రవారం స్థానిక ఎల్ సాల్వడార్‌లోని ఎల్ తుంకో బీచ్‌లో శిక్షణ పొందుతుండగా ఈ విషాదం చోటు చేసుకుందని ఆ దేశ సర్ఫింగ్ సమాఖ్య ఫెసాసర్ఫ్ తెలిపింది.

"మా దేశానికి ప్రాతినిధ్యం వహించిన గొప్ప అథ్లెట్ మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది" అని సర్ఫ్ ఫెడరేషన్ ఒక పోస్ట్‌లో పేర్కొంది . పారామెడిక్స్ సిబ్బంది ఆమెను రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

ఎల్ సాల్వడార్ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఒక ప్రకటనలో ఆమె ఆత్మకు శాంతికలగాలని కోరుకుంది. అంతర్జాతీయ సర్ఫింగ్ అసోసియేషన్ (ISA) కూడా ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించింది.

"క్రీడా ప్రపంచంలో సర్ఫింగ్ చాలా ప్రత్యేకమైనది అని ISA తెలిపింది. "ఆమె అంతర్జాతీయ పోటీ స్థాయిలో రాణించింది, ISA వరల్డ్ సర్ఫింగ్ గేమ్స్ మరియు ISA వరల్డ్ జూనియర్ సర్ఫింగ్ ఛాంపియన్‌షిప్ రెండింటిలోనూ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది" కానీ ఇంతలోనే ఇలా జరగడం అత్యంత బాధాకరం అని పేర్కొంది.

"మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు" అని డియాజ్ సోదరుడు జోస్ ఆమె మరణం తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. "దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ నీవు మా హృదయంలో ఎప్పటికీ సజీవంగానే ఉంటావు " అని డియాజ్ సోదరుడు బాధాతప్త హృదయంతో పోస్ట్ పెట్టాడు.

Tags

Read MoreRead Less
Next Story