Justin Trudeau: పాప్ స్టార్‌తో మాజీ ప్రధాని డేటింగ్..

Justin Trudeau: పాప్ స్టార్‌తో మాజీ ప్రధాని డేటింగ్..
X
సోషల్ మీడియాలో వీడియో వైరల్

ప్రముఖ పాప్ స్టార్ కేటీ పెర్రీ మరో తోడు వెతుక్కుంది. మాజీ ప్రధానితో కలిసి చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతోంది. ఎంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇద్దరూ కలుసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేటీ పెర్రీ ప్రస్తుతం కెనడాలో పర్యటిస్తోంది. మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో కలిసి ఒక ప్రైవేటు డిన్నర్ డేట్‌కు వెళ్లింది. మాంట్రియల్‌లో ఓ రెస్టారెంట్‌లో ఇద్దరూ కలిసి భోజనం చేశారు. డిన్నర్ తర్వాత ఇద్దరూ కులాసాగా మాట్లాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రెస్టారెంట్‌లో అనేక రకాలైన వంటకాలు ఆరగించినట్లు సమాచారం. ఇక వీడియోలో భద్రతా సిబ్బంది కూడా కనిపించారు. అంటే కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇద్దరూ విందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే విందు సమయంలో ఇద్దరిని చెఫ్ పలకరించారు. ఇక భోజనం చేయగానే వంట గదికి వెళ్లి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

కేటీ పెర్రీ(40).. అమెరికా గాయని. అనేక పాటలు రచించారు. టెలివిజన్ ద్వారా పాపులర్ అయ్యారు. ప్రముఖ సంగీత కళాకారుల్లో కేటీ పెర్రీ ఒకరిగా గుర్తుపొందారు. ప్రపంచ వ్యాప్తంగా 143 ఆల్బమ్‌లు ఉన్నాయి. ఈనెల ప్రారంభంలో నటుడు ఓర్లాండో బ్లూమ్‌తో తొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పింది. ఈ జంటకు నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం కేటీ పెర్రీ ఒంటరిగా ఉంటుంది. తోడు కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్పిన ట్రూడో కనిపించారు. 2023లో భార్య సోఫీ నుంచి ట్రూడో విడిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరూ కూడా ఒంటరిగా ఉండడంతో ఇద్దరి మధ్య డేటింగ్ జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో కేటీ పెర్రీ-ట్రూడో చాలా ఉల్లాసంగా.. సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

Tags

Next Story