Trudeau- Katy Perry: కెనడా మాజీ ప్రధాని ట్రూడో ప్రేమాయణం..

మాజీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో అమెరికన్ సింగర్ కేటీ పెర్రీ ప్రేమాయణం చర్చనీయాంశంగా మారింది. తాజాగా, పెర్రీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఇద్దరి మధ్య రిలేషన్‌ను ఉందని అధికారికంగా ప్రకటించింది. ట్రూడోతో కలిసి ఉన్న ఫోటోలను ఆమె పోస్ట్ చేశారు. ఇటీవల, ఇద్దరూ జపాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను పెర్రీ షేర్ చేసింది. ఒక ఫోటోలో ట్రూడో, పెర్రీలు సెల్ఫీకి ఫోజులు ఇచ్చారు. మరో పోస్టులో ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నట్లు ఉంది. ‘‘టోక్యో టైమ్స్ ఆన్ టూర్ అండ్ మోర్’’ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చింది.
జపాన్ మాజీ ప్రధాని ఫ్యూమియో కిషిడా, అతడి భార్య యూకోలను పెర్రీ, ట్రూడోలు కలుసుకున్న తర్వాత, పెర్రీ నుంచి ఈ పోస్ట్ వచ్చింది. అంతకుముందు, కిషిడా ఎక్స్‌లో ట్రూడో పెర్రీని ట్రూడో భార్యగా పేర్కొన్నారు. ‘‘ కెనడా మాజీ ప్రధాని, ఆయన భాగస్వామి మమ్మల్ని కలిశారు. ట్రూడో ప్రధానిగా ఉన్నసమయంలో అనేక సమయాల్లో మేము కలుసుకున్నాము. జపాన్-కెనడా యాక్షన్ ప్లాన్ రూపొందించడంతో సహా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి మేము ఇద్దరం పనిచేశాము. మేము ఇదే విధంగా స్నేహాన్ని కొనసాగించడం సంతోషంగా ఉంది’’ అని కిషిడా రాశారు. అక్టోబర్ 25న పారిస్‌లో పెర్రీ 41వ పుట్టిన రోజు సందర్భంగా ట్రూడోతో కలిసి ఉన్న ఫోటో బయటకు వచ్చింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని అంతా భావిస్తూ వస్తున్నారు. తాజాగా, పెర్రీ ఇద్దరి ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

