Kim Jong Un: కిమ్ 10 ఏళ్ల కుమార్తె కీలక బాధ్యతలు

Kim Jong Un: కిమ్ 10 ఏళ్ల కుమార్తె కీలక బాధ్యతలు
సైనిక అధికారిక కార్యక్రమాల్లో కిమ్ రెండో కుమార్తె

దాదాపు ఏడాది కిందట ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె జుయెను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. పదేళ్ల వయసున్న జుయె.. అమెరికాలోని ప్రధాన నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా రూపొందించిన ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని తన తండ్రితో కలిసి పరిశీలించింది.

అయితే ఆ అమ్మాయిని ఉత్తర కొరియా అధికారిక మీడియా పేరు పెట్టి సంబోధించలేదు. అసలు ఆమె పేరునుఅధికారికంగా వెల్లడించలేదు. దక్షిణ కొరియా గూఢచారి సంస్థ ఆమె వయస్సు దాదాపు 10 ఏళ్లు ఉంటుంది. కిమ్, అతడి భార్య రి సోల్ జు ముగ్గురు సంతానంలో ఆమె రెండోది అని పేర్కొంది.

ప్రభుత్వ ప్రచారాన్ని బట్టి కిమ్ కుటుంబానికి చెందిన మరో తరం ఉత్తర కొరియాను పాలించడానికి వేచి ఉందని, మనుగడ కోసం అణ్వాయుధాలపై ఆధారపడుతుందని ప్రజలకు పరోక్షంగా సంకేతాలిచ్చింది. ఆయుధ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం అంటే తమ పిల్లలను అమెరికా నుంచి రక్షించడం, కిమ్ కుటుంబం రూపొందించిన ప్రత్యేకమైన సోషలిస్ట్ రాజ్యాన్ని కోల్పోవడం అని ఉత్తర కొరియా తల్లిదండ్రులకు సందేశాన్ని అందించాలనే కిమ్ ఉద్దేశం తేటతెల్లమయ్యింది.

దక్షిణ కొరియా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ఆమె గత సంవత్సరంలో సైన్యానికి సంబంధించిన 13 ఈవెంట్‌లు, క్రీడల కోసం రెండు, ఆర్థిక వ్యవస్థ కోసం ఒకటి సహా 16 సార్లు బహిరంగంగా కనిపించింది. మొదటిసారి బయట ప్రపంచంలోకి వచ్చిన వారంలోనే అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినందుకు నిర్వహించిన ఫోటో సెషన్ కోసం కిమ్ జోంగ్ ఉన్ వెంట వచ్చింది. 2009లో రి సోల్‌ జుతో కిమ్‌కు వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. అయితే ముగ్గురు పిల్లల్లో కేవలం కుమార్తె జు ఏ గురించి మాత్రమే బయట ప్రపంచానికి తెలిసింది

Tags

Read MoreRead Less
Next Story