Kim Jong Un: కిమ్‌ సుఖం కోసం ఏటా 25 మంది అందమైన అమ్మాయిలు

కోరికలు తీర్చేందుకు ‘ప్లెజర్ స్క్వాడ్’

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎంత క్రూరుడో ప్రపంచానికి మొత్తం తెలుసు. చిన్న చిన్న నేరాలకు నిర్దాక్షిణ్యంగా శిక్షలు విధించడం కిమ్ స్టైల్. ఇక అక్కడ ఉండే వింతవింత రూల్స్ మరే దేశంలో కనిపించవు. ప్రజలు ఆకలి కేకలతో చనిపోతున్నా కూడా కిమ్ జోంగ్ ఉన్ మాత్రం అణ్వాయుధాల పరుగులో ముందున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా కిమ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న యోన్మీ పార్క్ అనే యువతి కిమ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. కిమ్‌ని సంతృప్తి పరిచేందుకు అందమైన అమ్మాయిలతో కూడిన ఓ ‘‘ప్లెజర్ స్వ్కాడ్’’ అనే గ్రూపు ఉంటుందని, ప్రతీ ఏడాది అందమైన 25 మంది వర్జిన్ అమ్మాయిలను కిమ్ ఎంచుకుంటారని పార్క్ తెలిపింది. కిమ్ ప్లెజర్ స్వ్కాడ్ కోసం తాను రెండు సార్లు ఎంపికైనప్పటికీ, తన కుటుంబ స్థితి ఆధారంగా తనను చేర్చుకోలేదని చెప్పారు.

అమ్మాయిల కోసం వారు స్కూళ్లలోని ప్రతి తరగతి గదిలోకి వెళ్లి చూస్తారని, అందమైన వారు ఎవరైనా పొరపాటున మిస్ అవుతారనే ఉద్దేశంతో స్కూల్ గ్రౌండ్‌లలో కూడా తనిఖీ చేస్తారని వెల్లడించింది. కొంతమంది అందమైన అమ్మాయిలను గుర్తించిన తర్వాత తొలుత వారి కుటుంబ స్థితిగతులు తెలుసుకుంటారని, అనంతరం దేశం విషయంలో వారి నిబద్ధతను పరిశీలిస్తారని యోన్మీ తెలిపింది. ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న కుటుంబ సభ్యులు లేదా దక్షిణ కొరియా లేదా ఇతర దేశాలలో బంధువులు ఉన్న కుటుంబాల అమ్మాయిలను ‘ప్లెజర్ స్క్వాడ్’లోకి తీసుకునేవారు కాదని వివరించింది.

ఇక అమ్మాయిల ఎంపిక పూర్తయిన అనంతరం వారు కన్యలు అని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు చేయిస్తారని, చిన్న లోపాన్ని గుర్తించినా వారిని పక్కనపెట్టేస్తారని యోన్మీ వివరించారు. కఠినమైన పరీక్షల అనంతరం అమ్మాయిలను రాజధాని ప్యాంగ్యాంగ్‌కు పంపుతారని, అక్కడ నియంత కోరికలను తీర్చాల్సి ఉంటుందని యోన్మీ వివరించినట్టు ‘మిర్రర్’ కథనం పేర్కొంది. ‘ప్లెజర్ స్క్వాడ్’ను మూడు విభిన్న గ్రూపులుగా విభజిస్తారు. ఒక బృందానికి మసాజ్‌, మరొక బృందానికి పాటలు, డ్యాన్స్ చేయడంలో శిక్షణ ఇప్పిస్తారు. ఇక మూడవ సమూహం నియంత కిమ్ జోంగ్ ఉన్, ఇతర ఉన్నతాధికారుల లైంగిక కోర్కెలు తీర్చాల్సి ఉంటుంది. పురుషులను ఎలా సంతోషపెట్టాలో ఈ అమ్మాయిలు నేర్చుకోవాల్సి ఉంటుందని, అదే వారి ఏకైక లక్ష్యం అని యోన్మీ పార్క్ వివరించినట్టు ‘మిర్రర్’ కథనం పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story